Site icon HashtagU Telugu

Jayam Ravi: దర్శకుడిగా మారబోతున్న జయం రవి.. మరో ఛాలెంజ్ కి రెడీ అంటూ?

Mixcollage 22 Feb 2024 07 09 Am 7094

Mixcollage 22 Feb 2024 07 09 Am 7094

హీరో,నటుడు జయం రవి గురించి మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం వరుసగా అవకాశాలను అందుకుంటూ ఫుల్ బిజీబిజీగా గడుపుతున్నారు. మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన పొన్నియిన్ సెల్వన్ సక్సెస్‌తో పాన్ ఇండియా ఇమేజ్‌ అందుకున్న జయం రవి ఇప్పుడు మరో చాలెంజ్‌కు రెడీ అవుతున్నారు. ప్రజెంట్‌ హీరోగా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ఈ స్టార్ హీరో త్వరలో మెగా ఫోన్ పట్టబోతున్నట్టుగా తాజాగా వెల్లడించారు. తన డైరెక్టోరియల్‌ లిస్ట్‌లో క్రేజీ ప్రాజెక్ట్స్‌ను రెడీ చేస్తున్నారు. ఆ మధ్య తనీ ఒరువన్‌ సీక్వెల్‌ను ఎనౌన్స్ చేసిన జయం రవి, ప్రస్తుతం బ్రదర్‌, జీనీ లాంటి సినిమాల్లో నటిస్తున్నారు.

మరో రెండు సినిమాలు డిస్కషన్ స్టేజ్‌లో ఉన్నాయి. ప్రస్తుతం ఫుల్ బిజీ బిజీగా ఉన్నప్పటికీ దర్శకుడిగా సత్తా చాటేందుకు రెడీ అవుతున్నారు ఈ కోలీవుడ్ స్టార్ హీరో. ఇకపోతే రవి ఇటీవలె సైరెన్ సినిమాతో ఆడియన్స్‌ ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. ఆ సినిమా ప్రమోషన్‌లో తన ఫ్యూచర్ ప్లానింగ్ గురించి ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. త్వరలో మెగా ఫోన్‌ పట్టబోతున్నట్టుగా చెప్పిన జయం రవి ఆల్రెడీ కథలు కూడా సిద్ధం చేసుకున్నారట. తొలి ప్రయత్నంగా కమెడియన్‌ యోగి బాబు లీడ్ రోల్‌లో ఒక సినిమాను రూపొందించబోతున్నట్టుగా వెల్లడించారు జయం రవి.

ఇప్పటికే హీరోగానూ మంచి విజయాలు సాధించిన యోగిబాబుతో సెటైరికల్‌ కామెడీని ప్లాన్ చేస్తున్నారు జయం రవి. తనే హీరోగా ఒక సినిమాను డైరెక్ట్‌ చేసేందుకు రెడీ అవుతున్నారు ఈ కోలీవుడ్ స్టార్‌. తన టేస్ట్‌కు తగ్గట్టుగా ఒక భారీ యాక్షన్ థ్రిల్లర్‌లో స్వయంగా నటించి దర్శకత్వం వహించబోతున్నారు. మరి హీరోగా సక్సెస్ అయిన జయం రవి దర్శకుడిగా సక్సెస్ అవుతాడో లేదో చూడాలి మరి.

Exit mobile version