Site icon HashtagU Telugu

Emraan Hashmi: ఆ స్టార్ హీరోని వదిలేస్తానన్న భార్య.. ఎందుకో తెలుసా?

Mixcollage 07 Mar 2024 11 21 Am 8305

Mixcollage 07 Mar 2024 11 21 Am 8305

తెలుగు సినీ ప్రేక్షకులకు బాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరిన ఇమ్రాన్ హష్మీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈయన బాలీవుడ్ ప్రేక్షకులతో పాటు టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. అయితే మొన్నటి దాకా హీరోగా అలరించిన ఆయన ఇప్పుడు విలనిజం చూపించేందుకు రెడీ అయ్యారు. టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఓజీ చిత్రంలో ఇమ్రాన్ విలన్ గా కనిపించనున్నారు. అయితే ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ లో జాయిన్ అయ్యారు. కాగా ఓజీ సినిమాకు సుజిత్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.

ఇది ఇలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఇమ్రాన్ తన పర్సనల్ లైఫ్ గురించి ఆసక్తికర విషయాలను బయటపెట్టారు. తన ఫిట్ నెస్ విషయంలో ఎంతో కఠినమైన ఆహార నియమాన్ని అనుసరిస్తానని.. దాదాపు రెండు సంవత్సరాలపాటు ఒకే రకమైన భోజనం తీసుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. నేను నా ఫిట్ నెస్ విషయంలో చాలా శ్రద్ద తీసుకుంటాను. డైట్ కచ్చితంగా ఫాలో అవుతాను. గతంలో క్వినోవా ఎక్కువగా తీసుకునేవాడిని. ఇప్పుడు దానిని తీసుకోవడం లేదు. దాదాపు రెండేళ్లు ఒకే రకమైన డైట్ ఫాలో అయ్యాను.

అవకాడో, బ్రెస్సెల్స్ మొలకలు, పాలకూర, ఆకు కూరలు, కీమా, చిలగడదుంపలు మాత్రమే తీసుకున్నాను. భోజనం, లంచ్, డిన్నర్ అన్నింటిలోనూ ఒకరకమైన డైట్ ఫాలో అయ్యాను. నా డైట్ చూసి నా భార్య ఎంతో విసిగిపోయింది. డైట్ మార్చుకోకపోతే నన్ను విదిలేస్తానని బెదిరించింది. కాకపోతే ఇప్పటివరకు ఆ పని మాత్రం చేయలేదు. నేను తినే ఆహారం తను అస్సలు తినదు అని చెప్పుకొచ్చారు ఇమ్రాన్ హష్మీ. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా స్పందిస్తున్నారు.