Daniel Balaji: చనిపోయి కూడా ఇద్దరి జీవితాల్లో వెలుగు నింపిన డేనియల్ బాలాజీ?

తాజాగా సినిమా ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. కోలీవుడ్ ప్రముఖ నటుడు డేనియ‌ల్ బాలాజీ కన్ను మూశారు. గుండెపోటుతో డేనియ‌ల్ బాలాజీ కనుమూశారు.

Published By: HashtagU Telugu Desk
Daniel Balaji

Daniel Balaji

తాజాగా సినిమా ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. కోలీవుడ్ ప్రముఖ నటుడు డేనియ‌ల్ బాలాజీ కన్ను మూశారు. గుండెపోటుతో డేనియ‌ల్ బాలాజీ కనుమూశారు. ఆయన ఆకస్మిక మరణంతో కోలీవుడ్ లో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. అర్థ‌రాత్రి ఒక్కసారిగా ఛాతిలో నొప్పిరావడంతో కుటుంబ సభ్యులు ఆయనను చెన్నై లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కానీ మార్గ మధ్యమంలోనే డేనియల్ బాలాజీ కన్ను మూశారని వైద్యులు తెలిపారు. ఎన్నో సినిమాల్లో డేనియల్ విలన్ గా నటించి మెప్పించారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన చిరుత సినిమాలో ఆయన విలన్ గా నటించారు.

అలాగే నాని హీరోగా నటించిన టక్ జగదీశ్ సినిమాలో విలన్ గా నటించారు డేనియల్ బాలాజీ. అయితే ఆయన చనిపోయిన ఇద్దరి జీవితంలో వెలుగులు నింపారు డేనియల్ బాలాజీ. దానాలన్నింటిలో అవయవదానం ఎంతో గొప్పది. చాలా మంది అవయవదానం చేస్తుంటారు. డేనియల్ కూడా ఆయన అవయవాలను దానం చేశారు. ఆయన తన రెండు కళ్ళను దానం చేశారు. తాను మరణించిన తర్వాత తన కళ్ళను దానం చెయ్యాలని నిర్ణయించుకున్నారు డేనియల్. ఇప్పుడు ఆయన మరణించిన తర్వాత వైద్యులు ఆయన కళ్ళను సేకరించి మరొకరిని అమర్చనున్నారు.

ఇందుకు సంబందించిన పత్రాల పై కుటుంబ సభ్యులు సంతకాలు పెట్టారు. ప్రభుత్వ ఆస్పత్రి వారు భద్రపరిచి మరో ఇద్దరికి చూపును ఇవ్వనున్నారు. ఇక డేనియల్ బాలాజీ అంత్యక్రియలు రేపు నిర్వహించనున్నారు. ఇంత మంచి మనసు ఉన్న నటుడు ఇలా ఆకాలంగా మరణించడం నిజంగా దారుణం అంటూ అభిమానులు అంటున్నారు.

  Last Updated: 31 Mar 2024, 07:40 AM IST