Site icon HashtagU Telugu

Ravi Antony : టిల్లు పంచుల వెనుక ఉన్న రైటర్ అతనేనా..?

Actor And Writer Ravi Antony For Reason Tillu Character Success

Actor And Writer Ravi Antony For Reason Tillu Character Success

Ravi Antony డీజే టిల్లు సూపర్ హిట్ అవ్వడంతో దానికి సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ సినిమా చేశారు. శుక్రవారం రిలీజైన ఈ సినిమా యునామిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది. టిల్లు స్క్వేర్ లో సిద్ధు పంచుల ప్రవాహం థియేటర్ లో ఆడియన్స్ ని సూపర్ గా ఎంటర్టైన్ చేస్తుంది. డీజే టిల్లు ఇప్పుడు టిల్లు స్క్వేర్ సిద్ధు క్యారెక్టర్ ఆ పాత్ర చెప్పే డైలాగ్స్ అన్నీ కూడా సిద్ధు రాశాడని తెలుస్తుంది. అయితే కేవలం సిద్ధు మాత్రమే కాదు ఆ పాత్ర వేసిన పంచుల వెనుక మరో రైటర్ కూడా ఉన్నాడని తెలుస్తుంది.

ఇంతకీ అతనెవరు అంటే రవి ఆంటోని అని తెలుస్తుంది. నటుడిగా చేస్తూనే రైటర్ గా రవి ఆంటోని అదరగొట్టేస్తున్నాడు. సిద్ధు జొన్నలగడ్డతో కృష్ణ అండ్ హిస్ లీలా సినిమాకు కూడా రవి ఆంటోని పనిచేశాడు. డీజే టిల్లులో ఆ రేంజ్ లో టిల్లు పంచుల వెనుక రవి ఆంటోని కూడా ఉన్నాడని తెలుస్తుంది.

టిల్లు స్క్వేర్ సినిమాలో కూడా అతని రైటింగ్ స్కిల్స్ కు ఆడియన్స్ ఫిదా అయ్యారు. రవి ఆంటోని లాస్ట్ ఇయర్ సూపర్ హిట్ అయిన మ్యాడ్ సినిమాలో నటించాడు. అతను చేసిన కామెడీ కూడా ఆడియన్స్ ను కడుపుబ్బా నవ్వించింది.