Pawan Kalyan: పవన్ కళ్యాణ్ చేతి వేళ్ళ వెనుక ఉన్న ఉంగరాల సీక్రెట్ ఇదే?

  • Written By:
  • Publish Date - February 29, 2024 / 12:30 PM IST

టాలీవుడ్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూనే మరొకవైపు రాజకీయాలలో యాక్టివ్ గా పాల్గొంటున్న విషయం తెలిసిందే. అయితే ఎన్నికల సమయం దగ్గర పడటంతో పవన్ కళ్యాణ్ సినిమాలను పక్కన పెట్టేశారు. ప్రస్తుతం పూర్తి స్థాయిలో రాజకీయాల పైన దృష్టి పెట్టారు. గత ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి ఓడిపోయిన పవన్ కల్యాణ్ ఈసారి టీడీపీ, బీజేపీతో పొత్తుతో ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. సినిమా షూటింగ్ లు, ఎన్నికల ప్రచార సభలతో చాలా బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ చేతికి ఉన్న ఉంగరాలపై గత కొంతకాలంగా విస్తృతమైన చర్చ జరుగుతోంది. ఎన్నో రకాల గాసిప్స్ ఊహాగానాలు కూడా వినిపించాయి. ముఖ్యంగా కుడి చేతికి రెండు ఉంగరాలు పెట్టుకుంటారు.

అందులో ఒకటి తాబేలు ఉంగరం, రెండోవది నాగప్రతిమతో ఉంటుంది. మరో చేతికి పగడపు ఉంగరం ఉంటుంది. అయితే పవన్ కల్యాణ్ వీటిని ఎందుకు పెట్టుకున్నారు అనే చర్చతో పాటు అనేక మందిలో సందేహాలు కూడా వచ్చాయి. పవన్ చేతి వేళ్లకు ఈ ఉంగరాలు పెట్టుకోవడం వెనుక ప్రత్యేక కారణాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆయన జాతకం ప్రకారం కుజ రాహువు సంధి, రాహు కేతువులకు సంబంధించిన కొన్ని దోషాలు ఉన్నట్లుగా జ్యోతిష్య నిపుణులు గుర్తించి ఈ ఉంగరాలు పెట్టుకోవాలని సూచించినట్లుగా చెబుతున్నారు. పవన్ కల్యాణ్ పుట్టిన తేది ప్రకారం చూసుకుంటే 2వ తేది సెప్టెంబరు 1971.

ఆయనది మకర రాశి. ఈ మకర రాశిలోనే కుజుడు, రాహువు, చంద్రుడు ఉన్నాడు. చంద్ర మంగళ యోగం ఉన్నప్పటికీ, కుజ రాహువు సంధి ప్రభావం ఉండడం వల్ల ఆయన నాగబంధం ఉన్న ఉంగరాన్ని ధరించడం చాలా కలిసొచ్చే అంశం. జాతకపరంగా ఆయన ధరించిన ఉంగరాలు సత్ఫలితాలను ఇస్తాయి. అయితే పవన్ కల్యాణ్ కి గత ఎన్నికల్లో రెండు సార్లు పోటీ చేసినా ఓటమి పాలవడం, వైవాహిక జీవితంలో కూడా బహుభార్యబంధాలు ముడిపడటం వంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకొని జాతక దోషం తగలకుండా ఉండాలనే పవన్ కల్యాణ్ నాగుపాము పడగతో కూడిన ఉంగరం, తాబేలు ఉంగరం పెట్టుకున్నట్లు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. కుటుంబంలో ఇబ్బందులు ఉన్నవారు, నర ఘోష, నర దృష్టి ఎక్కువగా ఉన్నవారు, రాజకీయ పరమైన ఇబ్బందులు ఉన్నవారు ఈ నాగబంధం ఉన్న ఉంగరం ధరిస్తారు. రెండోది కూర్మావతార ఉంగరం. ఇది తాబేలు ప్రతిమను కలిగి ఉంటుంది. ఎదుగుదలకు, అధికారానికి, ప్రజాకర్షణకు సూచనగా ఈ ఉంగరం గురించి జ్యోతిష శాస్త్రంలో చెబుతారని వివరించారు.