Anasuya Bharadwaj: స్కూల్స్ పై యాంకర్ అనసూయ ఫైర్!

రాష్ట్రంలోని కొన్ని పాఠశాలల తీరుపై ప్రముఖ యాంకర్, నటి అనసూయ ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • Written By:
  • Publish Date - October 30, 2021 / 03:08 PM IST

హైదరాబాద్: రాష్ట్రంలోని కొన్ని పాఠశాలల తీరుపై ప్రముఖ యాంకర్, నటి అనసూయ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని పాఠశాల యాజమాన్యాలు విద్యార్థులను పాఠశాలలకు పంపాలని తల్లిదండ్రులపై ఒత్తిడి పెంచుతున్నాయని ఆరోపించారు. పాఠశాలలకు వెళ్లే విద్యార్థుల ఆరోగ్యంపై ఆయా స్కూల్ యాజమాన్యాలు ఎలాంటి హామీ ఇవ్వడం లేదని ఆమె ఆరోపించారు.

ఈ విషయాన్ని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్కు ట్విట్ చేశారు.”కెటిఆర్ సార్! మొదట్లో కరోనా కారణంగా మేమంతా లాక్డౌన్ని అనుసరించాము. కోవిడ్ వైరస్ కేసుల సంఖ్య తగ్గడంతో లాక్డౌన్ క్రమంగా ఎత్తివేశారు.దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ కూడా శరవేగంగా జరుగుతోంది. కానీ వ్యాక్సిన్ తీసుకోని పిల్లల పరిస్థితి ఏమిటి? పాఠశాల యాజమాన్యాలు ఎందుకు ఎన్ఓసి సమర్పించమని తల్లిదండ్రులపై ఒత్తిడి చేస్తున్నాయి. పిల్లలకు ఏదైనా జరిగితే బాధ్యత ఎవరిదంటూ ఆమె ట్వీట్ చేశారు. మంత్రి కేటీఆర్ ఎప్పటిలాగే ఈ సమస్యను పరిశీలిస్తారని ఆశిస్తున్నట్లు ఆమె తెలిపారు.

దేశ వ్యాప్తంగా 18 ఏళ్లు పైబడిన వారందరికి వ్యాక్సిన్ పక్రియ కొనసాగుతుంది.అయితే చిన్నపిల్లలకు మాత్రం ఇంకా వ్యాక్సినేషన్ పక్రియ ప్రారంభం కాలేదు. ఓ పక్క విద్యాసంవత్సరం నష్టపోతామని విద్యార్థులు బాధపడుతున్నారు కానీ తల్లిదండ్రులు మాత్రం తమ పిల్లలు కరోనా బారిని పడతారెమోనని స్కూల్స్కి పంపించడంలేదు.కరోనా రెండవ దశ ముగిసిన తరువాత పలు రాష్ట్రాల్లో పాఠశాలలు తెరుచుకున్నాయి.అయితే పాఠశాలలు తెరుచుకున్న కొద్ది రోజులకే చాలా మంది విద్యార్థులు కరోనా బారిని పడ్డారు.దీంతో తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది. ఇటు ప్రవేట్ స్కూల్స్ యాజమాన్యాలు ఎలాగైన తమ పిల్లలను పంపిచాలని తల్లిదండ్రులను ఒత్తిడి చేయడం… ఆ తరువాత ఫీజు మొత్తం కట్టాలనే డిమాండ్ని తీసుకోస్తారు.ఫీజుల కోసం తమ పిల్లలను స్కూల్స్కి రావాలని యాజమాన్యాలు ఒత్తిడి చేస్తున్నాయని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.