టాలీవుడ్ యాక్టర్ అజయ్(Ajay).. తెలుగు, తమిళ ఫిలిమ్స్ లో విలన్‌గా, సపోర్టింగ్ ఆర్టిస్ట్‌గా నటిస్తూ వస్తున్నారు. విజయవాడకి చెందిన అజయ్ 1991లో తన సినీ కెరీర్ ని స్టార్ట్ చేశారు. ‘చెంగల్వ పూదండ’ అనే సినిమాతో నటుడిగా పరిచయం అయ్యారు. ఆ తరువాత పలు సినిమాల్లో నటించినా పెద్దగా గుర్తింపు లభించలేదు. ఇండస్ట్రీకి వచ్చిన పదేళ్ల తరువాత 2001లో పవన్ కళ్యాణ్(Pavan Kalyan) సినిమాలో నటించడంతో.. ఇటు పరిశ్రమలో అటు ఆడియన్స్ లో మంచి ఫేమ్ ని సంపాదించుకున్నారు. ఇంతకీ ఆ సినిమా ఏంటని ఆలోచిస్తున్నారా..?
ఇంకేం సినిమా.. మనందరి ఫేవరెట్, పవన్ కళ్యాణ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ‘ఖుషీ'(Kushi). ఆ మూవీలో అజయ్ కాలేజీ స్టూడెంట్ గా కనిపిస్తారు. హీరోయిన్ భూమికని అజయ్ టీజ్ చేస్తుంటే.. పవన్ కళ్యాణ్ తనకి బుద్ధి చెబుతారు. ఈ సీన్ కి అప్పటిలో ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఉండేది. ఈ ఒక్క సీన్ తో అజయ్ ఫేట్ మొత్తం మారిపోయింది. ఇండస్ట్రీలో మంచి గుర్తింపుని సంపాదించుకున్నారు. అప్పటి వరకు హీరో ఎవరో కూడా తెలియని చిన్న చిన్న సినిమాల్లో నటించే అవకాశాలు అందుకున్న అజయ్.. అక్కడి నుంచి స్టార్స్ సినిమాల్లో ఛాన్సులు అందుకుంటూ వచ్చాడు.
అలాగే ఈ సినిమా అజయ్ ని ఆడియన్స్ కూడా గుర్తు పెట్టుకునేలా చేసింది. ఆ మూవీలో నటించిన తరువాత అజయ్ ఒకరోజు స్నేహితులతో కలిసి చార్మినార్ దగ్గర ఉన్న కేఫ్‌కి టీ తాగడానికి వెళ్లారట. అక్కడ టీ తగిన తరువాత డబ్బులు ఇస్తుంటే.. ఆ కేఫ్ ఓనర్ వద్దు అన్నాడట. ఖుషీ సినిమాలో చేసింది అజయ్ అనే గుర్తుపట్టి.. డబ్బులు తీసుకోకుండా సినిమాల్లో బాగా నటించమని ఆ కేఫ్ ఓనర్ చెప్పాడట. ఒక సాధారణ వ్యాపారి రోజు డబ్బులు సంపాదించుకొని బ్రతికే వ్యక్తి.. తన సంపాదనలో 8 మంది టీ డబ్బుని పవన్ కళ్యాణ్ సినిమా కోసం వదులుకున్నాడు. ఆ సంఘటన అజయ్ కి లైఫ్ మర్చిపోలేనిదట. ఆ తరువాత ఎన్ని సినిమాల్లో నటించినా మళ్ళీ అలాంటి అనుభూతి ఎప్పుడూ ఎక్కడా కలగలేదని ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు అజయ్. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ అనేక సినిమాల్లో నటించాడు అజయ్.
Also Read : Ramya Krishnan : ‘నరసింహ’లో నీలాంబరి పాత్ర చేయకూడదు అనుకున్న రమ్యకృష్ణ.. ఎందుకో తెలుసా..?