Site icon HashtagU Telugu

Tamannaah Bhatia: కథ డిమాండ్ మేరకే ముద్దు సీన్లలో నటించా: తమన్నా

Lust Stories

Lust Stories

ఓటీటీ కల్చర్ కారణంగా స్టార్ హీరో హీరోయిన్స్ సైతం అందుకు తగ్గట్టుగా మారుతున్నారు. బోల్డ్ కథలకు సై అంటున్నారు. శ్రుంగార సన్నివేశాల్లో  సైతం రెచ్చిపోయి నటించేందుకు రెడీగా ఉంటున్నారు. ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్టుగా నటనలో మార్పులు తీసుకొస్తూ అడల్ట్ కంటెంట్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో మిల్క్ బ్యూటీ తమన్నా బోల్డ్ గా నటించి టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.  ఈ బ్యూటీ ‘లస్ట్ స్టోరీస్ 2’ ముద్దుసీన్లలో హాఫ్ న్యూడ్ గా కనిపించి అభిమానులను షాక్ కు గురిచేసింది.

తాజాగా ఆమె మాట్లాడుతూ, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా తాను కూడా మారానని చెప్పింది. ఇప్పుడు అందరి చేతిలో మొబైల్ ఫోన్ అందుబాటులోకి వచ్చిందని… అందరికీ అన్నీ తెలిసిపోతున్నాయని… ఈ నేపథ్యంలో ముద్దు సన్నివేశాలను కూడా సృజనాత్మకతలో ఒక భాగంగానే చూడాల్సి వస్తోందని తెలిపింది. అందుకే ‘లస్ట్ స్టోరీస్ 2’ వెబ్ సిరీస్ లో ముద్దులకు ఓకే చెప్పానని వెల్లడించింది. కథ డిమాండ్ మేరకే ఈ సన్నివేశాలను చేయాల్సి వచ్చిందని చెప్పింది.

తొలి నుంచి కూడా తాను ఎంచుకునే పాత్రల విషయంలో కానీ, ఎక్స్ పోజింగ్ విషయంలో కానీ తమన్నా ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తూ వచ్చింది. తోటి హీరోయిన్లు గ్లామర్ ను ఒలకబోస్తున్నప్పటికీ తాను మాత్రం పద్ధతిగానే నటించేది. ముద్దు సీన్లకు కూడా ఆమె వ్యతిరేకం. అయితే కొంత కాలంగా ఆమె తాను పెట్టుకున్న కండిషన్లకు తిలోదకాలు ఇస్తూ వస్తోంది. గ్లామర్ షోకు ప్రాధాన్యత ఇస్తోంది. ‘ఎఫ్3’ వంటి చిత్రాల్లో ఆమె స్కిన్ షో చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.

Also Read: Non Veg PaniPuri: ఆహా ఏమి రుచి.. తినేద్దామా ‘నాన్ వెజ్’ పానీ పూరీ

Exit mobile version