Jagapathi Babu: సోషల్ మీడియాలో అలాంటి పోస్ట్ చేసిన జగపతిబాబు.. సిగ్గు లేకుండా అడుగుతున్నా అంటూ?

టాలీవుడ్ హీరో, నటుడు, విలన్ జగపతి బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు ఎన్నో సినిమాలలో హీరోగా నటించి ఫ్యామిలీ హీరోగా తనకంటూ

Published By: HashtagU Telugu Desk
Mixcollage 13 Feb 2024 08 00 Am 5250

Mixcollage 13 Feb 2024 08 00 Am 5250

టాలీవుడ్ హీరో, నటుడు, విలన్ జగపతి బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు ఎన్నో సినిమాలలో హీరోగా నటించి ఫ్యామిలీ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్న జగపతిబాబు ప్రస్తుతం విలన్ క్యారెక్టర్ లలో నటిస్తూ వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు. ప్రస్తుతం తెలుగులో పది సినిమాలు విడుదల అవుతే అందులో రెండు మూడు సినిమాలు తప్పకుండా జగపతి బాబు విలన్ గా ఉంటున్నారు. అప్పుడప్పుడు పాజిటివ్ క్యారెక్టర్లలో కూడా నటిస్తున్నారు జగపతిబాబు. ఆయన ఇప్పటీ వరకు వందకు పైగా చిత్రాల్లో నటించాడు.

జగపతి బాబు కెరీర్ మెల్లగా ఫేడ్ అవుట్ అవుతూ వచ్చింది. దాంతో చేసేదేమి లేక విలన్ రోల్స్ ట్రై చేశాడు. లెజెండ్ మూవీలో ప్రధాన విలన్ రోల్ చేశాడు. అలా లెజెండ్ జగపతి బాబు కెరీర్ మార్చేసింది. ఆయన్ని స్టార్ చేసింది. ప్రస్తుతం సౌత్ ఇండియా క్రేజీ యాక్టర్స్ లో జగపతి బాబు ఒకరు. ఆయన సౌత్ తో పాటు నార్త్ లో కూడా సినిమాలు చేస్తున్నారు. ఒక్కరోజుకు జగపతి బాబు రూ.10 లక్షలు తీసుకుంటున్నట్లు సమాచారం. హీరోగా కంటే కూడా విలన్ గా జగపతి బాబు సంపాదిస్తున్నాడు. కాగా నేడు జగపతి బాబు బర్త్ డే. దీంతో ఆయన ఒక సోషల్ మీడియా పోస్ట్ పెట్టాడు.

 

ఒక చేతిలో ఎనర్జీ డ్రింక్, మరొక చేతిలో ఆల్కహాల్ తో ఫోటో పోస్ట్ చేసాడు. ఎలాగోలా పుట్టేశాను.. సిగ్గు లేకుండా అడుగుతున్నా.. మీ అందరి ఆశీస్సులు నాకు కావాలి.. రెండోది ఆలోచించకుండా క్విక్ గా డిసైడ్ చేయండి ఈ రెండిట్లో ఏది కొట్టమంటారు అంటూ క్వశ్చన్ మార్క్ వేస్తూ అభిమానులను ప్రశ్నించారు. దానికి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. రెండు మిక్స్ చేసి తాగమని కొందరు సలహా ఇస్తున్నారు. బర్త్ డే వేళా ఒక ఫేమ్ ఉన్న నటుడు మందు బాటిల్స్ ప్రదర్శించాడు. ప్రస్తుతం జగపతిబాబు పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నేటిజన్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా స్పందిస్తున్నారు..

  Last Updated: 13 Feb 2024, 08:01 AM IST