Site icon HashtagU Telugu

Acharya: ఆచార్యకు ‘మహేశ్’ వాయిస్ ఓవర్!

Mahesh

Mahesh

చిరంజీవి, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఆచార్య మూవీ అటు ప్రేక్షుకుల్లో, ఇటు అభిమానుల్లో ఆసక్తి కలిగిస్తోంది. భారీ అంచనాల మధ్య విడుదలవుతున్న చిత్రాల్లో ఇదొకటి. అభిమానులకు పెద్ద బ్రేకింగ్ న్యూస్‌ ఏమిటంటే..  సూపర్ స్టార్ మహేష్ బాబు ఆచార్యకు వాయిస్ ఓవర్ ఇచ్చినట్లు వెల్లడించారు. ఆచార్య కథకు సంబంధించిన కల్పిత పట్టణం గురించి పరిచయం చేస్తూ మహేష్ వాయిస్‌తో సీన్స్ ప్రారంభమవుతాయి. వాయిస్ ఓవర్ కోసం మహేష్‌ను సంప్రదించగా వెంటనే ఓకే అన్నాడట. ‘మెగాస్టార్’ చిరంజీవి, ‘మెగా పవర్ స్టార్’ రామ్ చరణ్ కలయికలో వచ్చిన ‘ఆచార్య’ చిత్రం ఏప్రిల్ 29న గ్రాండ్ గా విడుదలవుతోంది. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌పై నిరంజన్‌రెడ్డి, అవనేష్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై శ్రీమతి సురేఖ కొణిదెల ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే కథానాయికలుగా నటిస్తుండగా, సినిమాటోగ్రఫీ: తిర్రు, ఎడిటింగ్: నవీన్ నూలి.