Acharya: ‘ఆచార్య’ సెన్సార్ టాక్ వచ్చేసింది… రన్ టైమ్ ఎంతంటే..!

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కిన తాజా మూవీ 'ఆచార్య'. ఇప్పటికే పలుమార్లు వాయిదాపడిన ఈ చిత్రం... ఎట్టకేలకు ఏప్రిల్ 29 ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదల కాబోతోంది.

  • Written By:
  • Updated On - April 26, 2022 / 05:29 PM IST

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కిన తాజా మూవీ ‘ఆచార్య’. ఇప్పటికే పలుమార్లు వాయిదాపడిన ఈ చిత్రం… ఎట్టకేలకు ఏప్రిల్ 29 ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదల కాబోతోంది. ‘ఆచార్య’ మూవీ లో మెగాస్టార్ చిరంజీవి పక్కన, ఆయన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా సిద్ధ పాత్రలో నటించారు. చిరు సరసన కాజల్ నటించగా… చెర్రీకి జోడీగా పూజా హెగ్డే నటించింది. మణిశర్మ అందించిన సంగీతం ఇప్పటికే ఈ సినిమాకు హైలైట్ గా మారిన విషయం తెలిసిందే. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా ‘ఆచార్య’ సినిమాని నిర్మించాయి. ఇకపోతే ఈ సినిమా రీసెంట్ గా సెన్సార్ పనులను పూర్తి చేసుకుని, యు/ఏ సర్టిఫికేట్ ను సొంతం చేసుకుంది. ఓవరాల్ గా 2 గంటల 34 నిమిషాల రన్ టైం తో ఆడియన్స్ ముందుకు రాబోతుంది ‘ఆచార్య’ మూవీ.

ఇక ఫస్ట్ సెన్సార్ టాక్ విషయానికి వస్తే… మొత్తంగా ఈ సినిమా ప్రామిసింగ్ గా ఉన్నట్లు సమాచారం. స్టోరీ ని పూర్తిగా రివీల్ చేయనప్పటికీ… పాదగట్టం అనే గ్రామంలో ప్రజలపై సోనూ సూద్ చేసే అన్యాయాలను అరికట్టడానికి ‘ఆచార్య’ అయిన చిరంజీవి ఎంటర్ అవుతారు. కాకపోతే చిరంజీవి ఆ ఊరికి రావడానికి కారణం ఏంటి…? ఆ ఊరిలోనే ఉండే సిద్దా అయిన రామ్ చరణ్ కి ఏమైంది అన్నది సెకెండ్ ఆఫ్ లో తెలుస్తుందంట. ఓవరాల్ గా ఫస్టాఫ్ కట్టిపడేసే స్క్రీన్ ప్లే తో స్టోరీ ముందుకి వెళుతుందని టాక్. కాకపోతే అసలు కథ సెకెండ్ ఆఫ్ లో ఉండటంతో… సెకెండ్ ఆఫ్ మొత్తంమీద ఎబో యావరేజ్ టు హిట్ అనిపించే విధంగా ఉంటుదని అంటున్నారు. ఈ మూవీలో ఇంటెర్వల్ అండ్ ప్రీ క్లైమాక్స్ లు బాగా హైలెట్ అవుతాయని టాక్ వినిపిస్తోంది. మొత్తం మీద సెన్సార్ రిపోర్ట్ తర్వాత సినిమా ఎబో యావరేజ్ రేంజ్ లో ఉంటుందని అంటున్నారు. మెగాస్టార్ ‘ఆచార్య’ మూవీ… మెగా ఫ్యాన్స్ ని, కామన్ ఆడియన్స్ ని ఆకట్టుకునేలా ఉంటుందని తెలుస్తోంది. ఓవరాల్ గా చూస్తే సెన్సార్ టాక్ అయితే బాగానే ఉంది. ప్రేక్షకుల ముందుకు వచ్చాక ఫలితం ఎలా ఉంటుంది అనేది వేచి చూడాలి.