Acharya Movie Review: ప్రేక్షకులకు గుణపాఠం!

ఓ ప్రొడక్ట్ ను తయారుచేయడమే కాకుండా.. దాన్ని సరైన సమయంలో మార్కెట్ లోకి వదలాలి.

  • Written By:
  • Updated On - April 29, 2022 / 12:52 PM IST

సినిమా: ఆచార్య
రేటింగ్: 2/5
తారాగణం: చిరంజీవి, రామ్ చరణ్, పూజా హెగ్డే, సోను సూద్, జుష్ణు సేన్ గుప్తా, వెన్నెల కిషోర్, తనికెళ్ల, అజయ్ తదితరులు
సంగీతం: మణిశర్మ
నిర్మాత: నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి, రామ్ చరణ్
దర్శకత్వం: కొరటాల శివ
విడుదల తేదీ: 29 ఏప్రిల్ 2022

ఓ ప్రొడక్ట్ ను తయారుచేయడమే కాకుండా.. దాన్ని సరైన సమయంలో మార్కెట్ లోకి వదలాలి. అప్పుడే తయారు చేసిన వస్తువుకు వ్యాలూ ఉంటుంది. ఓ అర్థం ఉంటుంది. ఆచార్య విషయంలోనూ ఇదే జరిగింది. ఇప్పటికే RRR, KGF-2 వంటి విజువల్ వండర్ సినిమాలు చూసి… ఆచార్య వంటి సినిమా చూస్తే ఆస్థాయిలో ఆకట్టుకోలేదని అనిపిస్తోంది. దానికి తోడు నెల రోజుల వ్యవధిలో RRR, KGF-2 వంటి సినిమాలు సినీ అభిమానుల ఆకలి తీర్చేశాయి. దాంతో ఆచార్య తేలిపోయిందనే చెప్పాలి. అడవిలో ఓ ఆధ్యాత్మిక గ్రామం.. ఆ గ్రామాన్ని కాపాడేందుకు ఓ ఆయుర్వేద గూడెం.. ఆ అడవిలో ఉన్న ఖనిజాలను తవ్వేందుకు వచ్చే మైనింగ్ మాఫియా..ఆ మాఫియాను ఎదుర్కొన్న ఇద్దరు హీరోలు. ఇది సింపుల్‌గా ఆచార్య కథాంశం. కొరటాల ఏ కథ రాసుకున్నాడో.. ఏ సినిమా తీశాడో కాని.. సినిమా మాత్రం చిరంజీవి పాయింటాఫ్‌వ్యూలోనే వెళ్లిందని చెప్పాలి. కొరటాల మార్క్ డైరెక్షన్ ఈ సినిమాలో కనిపించదు. ఆధ్యాత్మికతను అడవిలో అన్నలను కలగలపడంతోనే.. కొరటాలకు అన్నల నేపథ్యం ఎంటో తెలియదని అర్థమవుతుంది.

ఉదాహరణ : అత్యాచారం చేసేందుకు ప్రయత్నిస్తున్న ముఠా నుంచి ఓ అమ్మాయి కాపాడిన చిరంజీవి.. మరో సన్నివేశంలో కల్లోలం కల్లోలం అని ఐటమ్ సాంగ్‌లో మరో అమ్మాయితో చిందులేయిస్తాడు. హీరోయిజం కోసం అమ్మాయిలను కాపాడే సీన్లు పెట్టి.. ఆ రూల్స్ అవే హీరోకు వర్తించవని కొరటాలే ఈ సినిమాలో చెప్పకనే చెప్పాడు. డైరెక్షన్ ఎలా ఉన్నా.. డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో చిరంజీవి అండ్ కో ఏ స్థాయిలో వేలు పెట్టారో సినిమా చూస్తే ఇట్టే అర్థమవుతుంది. పైసల కోసం కాకుండా ప్రాధాన్యమున్న పాత్రలు పూజా హెగ్ధే ఎంచుకుంటే బాగుంటుంది. క్లైమాక్స్‌ సీన్లలో కెమెరామెన్ పనితనం కనిపిస్తుంది. రిలీజ్ ముందే పాటలు తేలిపోయిన విషయం తెలిసిందే. ఎప్పటిలాగే మణిశర్మ బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుంది. ఓ విధంగా చెప్పాలంటే…. మణిశర్మ బ్యాగ్రౌండ్ స్కోర్‌తో సినిమాకు బూస్టప్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఏంటీ.. చిరు యాక్టింగ్ గురించి చెప్పలేదనేగా మీ అనుమానం. దునియాను దున్నేసే యాక్టర్స్ వచ్చేస్తున్నారు గురూ. ఇంకా మారకపోతే ఎలా..? ఓ మై కాజల్ కొరటాల లాగే నేను నున్ను ఎడిట్ చేశా.. సో సారి. ఏది ఎలా ఉన్నా.. అనుకున్న సమయానికి సినిమా రిలీజ్ చేసి ఉంటే ఆచార్య అమ్ముడుపోయే సినిమానే..

కొరటాల శివ తెరకెక్కించిన ఈ సినిమా తొలిరోజే 25 కోట్లు వసూలు చేస్తుందని అంచనా. సినిమా బడ్జెట్ 140 కోట్లు. తండ్రీకొడుకులు కలిసి సినిమా మొత్తం ఒకే స్క్రీన్ పంచుకోవడం ఇదే తొలిసారి. ఆచార్య సినిమా ఇప్పటికే 130 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ పూర్తయింది. ట్విట్టర్ లో సినిమాపై రివ్యూలు ఇలా వస్తున్నాయి. సినిమా తొలిభాగం డీసెంట్‌గా ఉండి సాధారణంగా ఉంటుందని చెబుతున్నారు. రెండవ భాగంలో తొలి 40 నిమిషాలు పూర్తిగా అభిమానుల్ని వెర్రెక్కించే విధంగా మాస్ ఎలివేషన్స్, ఫైట్స్, బీజీఎం, పాటలతో అద్దిరిపోతుందని అంటున్నారు. సినిమా క్లైమాక్స్ చాలా ఎమోషనల్‌గా ఉంటూనే హిందూ మతంపై సందేశముంటుంది.

బాటమ్ లైన్
సరైన టైంకు రాలేదయ్యా.

రివ్యూ బై : సంకీర్తన్.జి