Prithviraj Sukumaran: సాలార్ నటుడికి యాక్సిడెంట్, 3 వారాలు రెస్ట్

మలయాళ స్టార్ నటుడు పృధ్వీరాజ్ సుకుమారన్ షూటింగ్ లో గాయపడ్డాడు.

Published By: HashtagU Telugu Desk
Prithvi

Prithvi

మలయాళ స్టార్ నటుడు పృధ్వీరాజ్ సుకుమారన్ షూటింగ్ లో గాయపడ్డాడు. వెంటనే ఆయన్ను హుటాహుటిన కొచ్చిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో జాయిన్ చేశారు. ప్రస్తుతం ఈ హీరో విలాయత్ బుద్ధ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించి తీస్తున్న యాక్షన్ సీన్ లో భాగంగా బస్సుపై నుంచి జారిపడ్డాడు పృధ్వీరాజ్. అతడి కాలికి చిన్న గాయమైంది. గాయం చిన్నదే అయినప్పటికీ సర్జరీ తప్పనిసరి అని వైద్యులు సూచించడంతో, మరికొద్దిసేపట్లో పృధ్వీరాజ్ కు ఆపరేషన్ నిర్వహించనున్నారు.

ఆ తర్వాత కనీసం 3 వారాల పాటు రెస్ట్ తీసుకోవడం అనివార్యమని వైద్యులు తెలిపారు. ఈ స్టార్ హీరో పాన్ ఇండియా మూవీ సలార్ లో ముఖ్యపాత్రలో కనిపించనున్నారు.  సచి దర్శకత్వంలో విలాయత్ బుద్ధాని ప్రకటించారు. ఆ తర్వాత కొన్ని రోజులకు సచి అకాల మరణం చెందారు. దీంతో ఆ సినిమా బాధ్యతలు జయన్ నంబియార్ చేతిలో పెట్టారు. షూటింగ్ మరో నెల రోజుల్లో పూర్తవుతుందనగా, పృధ్వీరాజ్ గాయపడ్డాడు.

రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా కెజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న సలార్ లో విలన్ గా పృథ్విరాజ్ సుకుమారన్ నటిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో తన పాత్ర పేరు వరదరాజ మన్నార్. నీల్ రెగ్యులర్ స్టైల్ లో మసిపూసిన బట్టలు, మొహం, గెటప్ తో ఈ విలక్షణ నటుడు భయపెట్టే లుక్స్ తో ఉన్నాడు. మెయిన్ విలన్ ఇతననే మెసేజ్ ఇచ్చినట్టే.

Also Read: CM KCR: మహారాష్ట్రకు కేసీఆర్, 600 కార్లతో భారీ కాన్వాయ్‌

  Last Updated: 26 Jun 2023, 01:30 PM IST