Accident on Bigg Boss Sets : బిగ్ బాస్ సెట్ (Bigg Boss Set) లో ప్రమాదం జరిగిన ఘటన తమిళనాట చోటుచేసుకుంది. నార్త్ లో సూపర్ సక్సెస్ అయినా బిగ్ బాస్ సౌత్ లో కూడా అంతే ఆదరణ తో రన్ అవుతుంది. తెలుగు లో రీసెంట్ గా 8 వ సీజన్ మొదలు అవ్వగా..గతంతో పోలిస్తే తక్కువ TRP రేటింగ్ తో రన్ అవుతుంది. ఇక తమిళనాట 7 సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో 8వ సీజన్ త్వరలో ప్రారంభం కాబోతుంది. ఈ సారి హోస్ట్ మారారు. గత సీజన్ లకు కమల్ హాసన్ హోస్ట్ గా వ్యవహరించగా..ఈసారి విజయ్ సేతుపతి వ్యవహరించబోతున్నాడు.
తాజాగా బిగ్ బాస్ సెట్లో ప్రమాదం చోటు చేసుకుంది. ఈవీపీ ఫిల్మ్ సిటీ లో బిగ్ బాస్ సెట్ నిర్మిస్తున్నారు. హౌస్ లోపల కొంత మెయింటెనెన్స్ వర్క్ జరుగుతోంది. ఈ పనిలో పెద్ద సంఖ్యలో ఉత్తరాది కార్మికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్ కి చెందిన సైన్ ఖాన్ (47) బిగ్ బాస్ సెట్స్‌లో పని చేస్తుండగా, 20 అడుగుల ఎత్తు నుండి ప్రమాదవశాత్తూ కింద పడిపోయాడు. దీంతో ఒక్కసారిగా భయభ్రాంతులకు గురైన అక్కడున్న వారు అతడిని వెంటనే దగ్గరలోకి ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు. ప్రస్తుతం ఐసీయూలో అతడికి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై నసరపేట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే అంత ఎత్తు నుంచి కింద పడినా ఆ వ్యక్తి ఎటువంటి ప్రాణాపాయం లేకుండా కేవలం గాయాలతో బయట పడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
కాగా ఈవీపీ ఫిల్మ్ సిటీ లో ఇప్పుడే కాదు తరుచు ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. ఇండియన్ 2, కాలా, బిగిల్ వంటి సినిమాల సెట్స్ వేసే క్రమంలో క్రేన్ పడిపోవడంతో పాటు, కొందరు చనిపోయారు. ఇప్పుడు ఒక వ్యక్తి ఏకంగా 20 అడుగుల ఎత్తు నుంచి పడి చావు అంచుల దాకా వెళ్ళి వచ్చాడు. మరి ఇంకా ఇలా అజాగ్రత్తగా ఉంటూ ఎంత మంది ప్రాణాలను బలి తీసుకుంటారు? అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.
Read Also : KTR : రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ పట్ల కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ ప్రమాణాలు