Site icon HashtagU Telugu

Dacoit: అడ‌వి శేష్‌, మృణాల్ ఠాకూర్‌కు గాయాలు!

Dacoit

Dacoit

Dacoit: అడవి శేష్, మృణాల్ ఠాకూర్ క‌లిసి న‌టిస్తున్న చిత్రం డెకాయిట్ (Dacoit). అయితే ఈ మూవీ షూటింగ్ సమయంలో హీరో, హీరోయిన్లు గాయపడినట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవల విడుదలైన ‘డెకాయిట్’ గ్లింప్స్‌లో మృణాల్, అడవి శేష్ ఇద్దరూ గాయాలతో కనిపించారు. మృణాల్ ఠాకూర్ తన నుదిటిపై తగిలిన గాయాన్ని చూపిస్తూ “సబ్‌కా బద్లా లేగీ జూలియట్” అంటూ ఒక పోస్ట్ చేశారు. ఈ పోస్ట్‌లో అడవి శేష్ కూడా ఆమె పక్కన ఉండటం గమనించవచ్చు. అయితే ఈ గాయాలు స్వ‌ల్పంగానే అయిన‌ట్లు స‌మాచారం. గాయాల‌తోనే వారు షూటింగ్ చేసిన‌ట్లు స‌మాచారం.

ఈ గాయాలు సినిమాలోని యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణలో భాగంగా జరిగినట్లు తెలుస్తోంది. ‘డెకాయిట్’ ఒక ఇంటెన్స్ యాక్షన్ లవ్ స్టోరీగా రూపొందుతోంది. ఈ చిత్రంలో అడవి శేష్, మృణాల్ ఠాకూర్ ప్ర‌ధాన పాత్రల్లో నటిస్తున్నారు. బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ కూడా ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ‘డెకాయిట్’ చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ఇది దాదాపు తుది దశకు చేరుకుంది. ఈ చిత్రం డిసెంబర్ 25, 2025న విడుదల కానుంది.

Also Read: Champions League T20: ఛాంపియన్స్ లీగ్ టీ20 నిలిపివేత‌కు కారణాలివేనా?

సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ఇది దాదాపు తుది దశకు చేరుకుంది. హైదరాబాద్ తర్వాత మహారాష్ట్రలో ఒక విస్తృతమైన షెడ్యూల్ ప్లాన్ చేసిన‌ట్లు స‌మాచారం. ‘డెకాయిట్’ సినిమా క్రిస్మస్ సందర్భంగా థియేటర్లలో విడుదల కానుంది. అయితే శేష్, మృణాల్ గాయాల‌పై చిత్ర‌బృందం నుంచి ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌న రాలేదు. అలాగే హీరో, హీరోయిన్లు కూడా స్పందించ‌లేదు. అడ‌వి శేష్ ప్ర‌స్తుతం ఈ సినిమాతో పాటు జీ2 (గుఢ‌చారి 2) మూవీలో కూడా యాక్ట్ చేస్తున్నాడు.

Exit mobile version