Site icon HashtagU Telugu

Shah Rukh Khan : షారుఖ్ ఖాన్‌కి విలన్‌గా అభిషేక్ బచ్చన్..!

Abhishek Bachchan, Shah Rukh Khan, King Movie

Abhishek Bachchan, Shah Rukh Khan, King Movie

Shah Rukh Khan : బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్.. గత ఏడాది బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్నారు. పఠాన్ తో మొదలైన షారుఖ్ హిట్స్ పరంపర జవాన్, డంకీ అంటూ ముందుకు సాగింది. ఈ మూడింటిలో పఠాన్ అండ్ జవాన్ సినిమాలు వెయ్యి కోట్ల మార్క్ ని క్రాస్ చేసి కొత్త రికార్డుని సృష్టించాయి. వెయ్యి కోట్ల క్లబ్ లో రెండు సినిమాలను చేర్చిన మొదటి హీరోగా షారుఖ్ రికార్డు క్రియేట్ చేసారు. ఇక ఈ మూడు బ్లాక్ బస్టర్స్ తరువాత షారుఖ్ ఏ సినిమా చేయబోతున్నారో అని అందరిలో ఆసక్తి నెలకుంది.

తన నెక్స్ట్ సినిమా కోసం షారుఖ్.. దర్శకుడు సుజోయ్ ఘోష్ ని ఎంచుకున్నారు. ఈ దర్శకుడు కహాని, బద్లా, లస్ట్ స్టోరీస్ వంటి సినిమాలను డైరెక్ట్ చేసారు. ఇప్పుడు షారుఖ్ తో ఓ బిగ్ ప్రాజెక్ట్ ని హ్యాండిల్ చేయబోతున్నారు. కేవలం సుజోయ్ ఘోష్ మాత్రమే కాదు, మరో దర్శకుడు కూడా ఈ సినిమా కోసం పని చేయబోతున్నారట. పఠాన్ సినిమా డైరెక్ట్ చేసిన సిద్దార్థ్ ఆనంద్.. ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాలను డైరెక్ట్ చేయనున్నారట. ఈ చిత్రానికి ‘కింగ్’ అనే టైటిల్ ని పెట్టినట్లు సమాచారం. ఇక ఈ మూవీలో షారుఖ్ కి విలన్ గా అభిషేక్ బచ్చన్ ఎంపిక చేసుకున్నారట.

అభిషేక్ బచ్చన్ గతంలో కూడా పలు సినిమాల్లో విలన్ గా కనిపించారు. యువ, రావణ్, బ్రీత్ వంటి సినిమాల్లో విలన్ గా కనిపించి ఆడియన్స్ నుంచి మంచి మార్కులను అందుకున్నారు. ఇక ఇప్పుడు షారుఖ్ కి విలన్ గా అంటే.. బాలీవుడ్ ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తుంది. మరి సిల్వర్ స్క్రీన్ పై షారుఖ్ అండ్ అభిషేక్ ఎలా థ్రిల్ చేయబోతున్నారో చూడాలి. కాగా ఈ మూవీలో షారుఖ్ కుమార్తె సుహానా ఖాన్ కూడా నటిస్తున్నారు.

Exit mobile version