టాలీవుడ్ (Tollywood) సినీ బాక్స్ ఆఫీస్ వద్ద ఆగస్టు 15 న అసలైన సినీ సందడి మొదలు కాబోతుంది. ఆ రోజు ఒకటి రెండు చిత్రాలు కాదు చాలా సినిమాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాయి. వాటిలో అయ్(AAy) మూవీ ఒకటి. మ్యాడ్ సినిమాతో గతేడాది సూపర్ హిట్ కొట్టిన ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ (Nithin)..ఇప్పుడు అయ్ తో ఆగస్టు 15 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. నార్నే నితిన్, నయన్ సారిక ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రానికి అంజి కంచిపల్లి దర్శకత్వం వహిస్తుండగా.. రామ్ మిరియాల మ్యూజిక్ అందించారు. గీత ఆర్ట్స్ 2 బ్యానర్ ఫై బన్నీ వాసు నిర్మించారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇప్పటికే విడుదలైన సాంగ్స్ , ట్రైలర్ సినిమా ఫై అంచనాలు పెంచేయగా..ఇక ఇప్పుడు అసలు సిసలైన ప్రీ రిలీజ్ వేడుకను సిద్ధం చేయబోతున్నారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అగ్ర హీరోలు జూనియర్ ఎన్టీఆర్ (NTR), ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun)హాజరవుతారనే వార్త ఇండస్ట్రీలో వినిపిస్తోంది. అదే జరిగితే ఆయ్ కు అదిరిపోయే పబ్లిసిటి వస్తుంది. అటు నందమూరి ఇటు అల్లు అభిమానుల సపోర్ట్ ఫుల్లుగా ఆయ్ కు లభించడం..ఓపెనింగ్స్ అదరగొట్టడం ఖాయమని అంత భావిస్తున్నారు. మరి ఆగస్టు 15 న రామ్ పోతినేని డబుల్ ఇస్మార్ట్‌తో పాటు రవితేజ మిస్టర్ బచ్చన్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మరి ఆ రెండిటి మధ్యలో అయ్..ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.
Read Also : Esha Rebba : ఈషా పై అందాలతో పిచ్చెక్కిపోతున్న ఫాన్స్