Rajkumar Kasi Reddy : రాజావారు రాణిగారు, బెదురులంక, అశోకవనంలో అర్జున కళ్యాణం.. వంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు రాజ్ కుమార్ కసిరెడ్డి. గోదావరి స్లాంగ్‌తో, తనదైన డైలాగ్ డెలివరీతో మంచి అవకాశాలు అందుకుంటూ వస్తున్నారు. ప్రస్తుతం ఈ నటుడు గీతాఆర్ట్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ‘ఆయ్’ సినిమాలో నటిస్తున్నారు.
ఎన్టీఆర్ బామ్మర్ది నార్నే నితిన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో రాజ్ కుమార్ కసిరెడ్డి ప్రధాన పాత్రలో కనిపిస్తున్నాడు. వచ్చే నెలలో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగానే ఒక ఫేక్ బెట్టింగ్ రైడ్ ని చిత్రీకరించి, రాజ్ కుమార్ కసిరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు చూపించారు. ఆ వీడియోలో కసిరెడ్డితో పాటు మరో నటుడు అంకిత్ కొయ్య కూడా ఉన్నారు. సినిమాలో వీరిద్దరి పాత్రలు బెట్టింగ్ రాజా తరహాలో ఉండబోతున్నట్లు తెలుస్తుంది.
ఇక ఈ వీడియోలు రాజ్ కుమార్ కసిరెడ్డి మాట్లాడుతూ.. “మేము నటించిన ఆయ్ సినిమా ఆగష్టు 15న రిలీజ్ కాబోతుంది. నిర్మాత బన్నీవాసు గారిని ప్రమోషన్స్ చేయమంటే జనసేన పార్టీ పనులు ఉన్నాయంటూ, మమ్మల్నే ప్రమోషన్స్ చేయమన్నారు. దీంతో మాకు ఏం చేయాలో తెలియక బెట్టింగ్ ఆడుతూ పోలీసులకు దొరికిపోయాము. మేము అరెస్ట్ అయ్యాము వచ్చి విడిపించండి అని బన్నీ వాసుగారికి ఫోన్ చేసాము. ఆయన వస్తున్నారు, ఆయన వచ్చాక ప్రమోషన్స్ ఏం చేయాలో మాట్లాడతాం” అంటూ చెప్పుకొచ్చారు.
బెట్టింగ్ రైడ్ లో అడ్డంగా దొరికిపోయిన #AAY సినిమా నటులు #RajkumarKasiReddy & #AnkithKoyya 🚨
The actors are currently in police custody! Check out their response to the arrest. pic.twitter.com/JQbFLfPQtO
— Geetha Arts (@GeethaArts) July 17, 2024
ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. కాగా ఈ మూవీని అంజి కె.మణిపుత్ర డైరెక్ట్ చేస్తున్నారు. గోదావరి బ్యాక్ డ్రాప్ తో సాగే ఈ సినిమాలో సారిక హీరోయిన్ గా నటిస్తున్నారు. మొదటి సినిమా ‘మ్యాడ్’తో హిట్ అందుకున్న నితిన్.. ఈ సినిమాతో ఎలాంటి విజయం అందుకుంటారో చూడాలి.