Aarthi Agarwal: ఆర్తి అగర్వాల్ కెరియర్ నాశనం అవడానికి గల కారణాలు ఇవే?

  • Written By:
  • Publish Date - March 6, 2024 / 11:00 AM IST

టాలీవుడ్ ఒకప్పటి స్టార్ హీరోయిన్ దివంగత నటి ఆర్తి అగర్వాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం కాలేదు. ఆర్తి అగర్వాల్ పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చేది ఆమె అందం. తన అందంతో ప్రేక్షకులను కట్టిపడేయడంతో పాటు తన నటనతో ఎంతోమందిని ఆకట్టుకుంది. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది ఆర్తి అగర్వాల్. దాదాపు పదేళ్ల పాటు టాలీవుడ్‌ని ఊపేసింది. అనుష్క, శ్రియా, నయనతార వంటి స్టార్‌ భామల జోరు సాగుతున్న సమయంలోనూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని, ఇమేజ్‌ని క్రియేట్‌ చేసుకుంది. లవ్‌ స్టోరీలకు కేరాఫ్‌గా నిలిచింది. అదే సమయంలో ఇంద్ర మూవీలో మాస్‌ రోల్‌తోనూ మెప్పించింది.

కెరీర్‌ పీక్‌లో ఉన్న సమయంలోనే ఆర్తి అగర్వాల్‌ ట్రాక్‌ తప్పింది. సినిమాలు తగ్గిపోయాయి. అనారోగ్య సమస్యలు వచ్చాయి. ఒక్కసారిగా ఆమె డౌన్‌ అయిపోయింది. అంతలోనే కనుమరుగయ్యింది. ఆర్తి అగర్వాల్‌ 2015 జూన్‌ 6న కన్నుమూసింది. అభిమానులను సోకసంద్రంలో ముంచేసింది. అయితే నేడు ఆర్తి అగర్వాల్‌ జయంతి. ఈ సందర్భంగా ఆమెకు సంబంధించిన కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా వెంకటేష్ హీరోగా నటించిన నువ్వు నాకు నచ్చావ్ సినిమాతో 2001లో తెలుగు సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్ ఇచ్చింది ఆర్తి అగర్వాల్. తొలి చిత్రంతోనే అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత నువ్వు లేక నేను లేను, అల్లరి రాముడు, ఇంద్ర, నీ స్నేహం, పల్నాటి బ్రహ్మనాయుడు, వసంతం, అడవి రాముడు, వీడే, నాగార్జున, సోగ్గాడు, అందాల రాముడు వంటి ఎన్నో సినిమాలలో నటించి మెప్పించింది.

ఐదారేళ్లు ఆమె కెరీర్‌ పీక్‌లో నడించింది. బ్యాక్‌ టూ బ్యాక్‌ హిట్లు అందుకుంది. స్టార్‌ హీరోయిన్‌ అయ్యింది. ఆ తర్వాత నెమ్మదిగా అవకాశాలు తగ్గాయి. ఏడాదికి ఒకటి రెండుసినిమాలు, కొన్నిసార్లు అసలే రాలేదు. మరి ఆర్తి అగర్వాల్‌ కెరీర్‌ నాశనం అవ్వడానికి కారణాలు చాలానే ఉన్నాయి. వాటిలో ఒకటి ప్రేమ. తరుణ్‌ తో ఆమె వరుసగా రెండు సినిమాలు చేసింది. నువ్వు లేక నేను లేను సమయంలోనే ఇద్దరు ప్రేమలో పడ్డారు. ప్రేమ కారణంగా ఇద్దరు సినిమాలు చేయలేదు. అవకాశాలు కూడా తగ్గాయి. కానీ ఆ ప్రేమ బెడిసి కొట్టింది. పేరెంట్స్ వరకు వెళ్లడంతో నిబంధనలు పెట్టడం స్టార్ట్ చేశారు.
రెండోది తండ్రి కారణం.. ఆర్తి అగర్వాల్‌ కెరీర్‌ నాశనం కావడానికి ఆమె తండ్రి కూడా ఒక కారణమట. ఆయన ప్రతి సినిమా షూటింగ్‌కి వచ్చేవాడు, రూల్స్ పెట్టావాడట. అది సినిమా షూటింగ్‌ల్లో అందరికి ఇబ్బందిగా ఉండేదని, ఆర్తి కూడా చాలా ఇబ్బంది పడేదని, సరైన ఔట్‌పుట్‌ వచ్చేది కాదని, దీంతో అవకాశాలు కూడా తగ్గిపోయాయని నిర్మాత చంటి అడ్డాల ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు.

ఆర్తి కెరీర్‌ ఫేడౌట్‌కి తండ్రి కూడా ఒక కారణమని తెలిపారు. అలాగే ఆర్థిక ఇబ్బందులు కూడా ఒక కారణంగా చెప్పొచ్చు. తరుణ్‌ తో ప్రేమ విఫలయమ్యింది. సినిమాలు తగ్గాయి. ఆర్థిక ఇబ్బందులు స్టార్ట్ అయ్యాయి. ఇంట్లో పేరెంట్స్ నుంచి ఒత్తిడి పెరిగింది. ఇవన్నీ ఆమెపై ఒత్తిడి పెంచాయి. ఇది డిప్రెషన్‌కి కారణమయ్యింది. అనంతరం ఆమె ఆత్మహత్యకి పాల్పడాల్సి వచ్చింది. 2005లో ఆత్మహత్యకు పాల్పడింది. దాన్నుంచి కోలుకున్నాక ఉజ్వల్‌ కుమార్‌ని పెళ్లి చేసుకుంది. రెండేళ్లకే ఆయన్నుంచి విడాకులు తీసుకుంది. ఆ తర్వాత మళ్లీ కెరీర్‌ని మొదలు పెట్టింది. అయితే బరువు పెరిగిన ఆర్తి బరువు తగ్గించుకునే క్రమంలో అనేక రకాల ట్రీట్‌మెంట్‌ తీసుకుంది. కానీ అమె ఆరోగ్యంపైనే ప్రభావం చూపించింది. చివరికి అది హార్ట్ ఎటాక్‌కి దారి తీసింది. తొమ్మిదేళ్ల క్రితం ఆమె హఠాన్మరణం చెందింది. ఆమె మరణించిన సినిమాలతో ఇప్పటికీ ఆడియెన్స్ గుండెల్లో ఉంది ఆర్తి అగర్వాల్‌.