Site icon HashtagU Telugu

Aamir Khan : ‘పఠాన్’ సినిమాలో మా అక్క నటించింది మీకు తెలుసా.. ఆమిర్ ఖాన్

Aamir Khan Sister In Shah Rukh Khan Pathaan Movie

Aamir Khan Sister In Shah Rukh Khan Pathaan Movie

Aamir Khan : బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్.. ఒక ఇంటరెస్టింగ్ న్యూస్ ని ఆడియన్స్ కి తెలియజేసారు. షారుఖ్ ఖాన్ నటించిన ‘పఠాన్’ సినిమాలో ఆమిర్ సోదరి కూడా ఉన్నారట. ఈ విషయాన్ని ఆమిర్ స్వయంగా తెలియజేసారు. బాలీవుడ్ సూపర్ హిట్ టాక్ షో.. కపిల్ శర్మ షో రీసెంట్ ఎపిసోడ్ కి ఆమిర్ గెస్ట్ గా వచ్చారు. ఈ షోకి ఆమిర్ తన సోదరితో పాటు కలిసి వచ్చారు. ఇక ఈ షోలో మాట్లాడుతూ.. పఠాన్ సినిమాలో తన సోదరి నటించిన సన్నివేశం గురించి అందరికి తెలియజేసారు.

పఠాన్ సినిమాలో షారుఖ్ ఒక గ్రామాన్ని కాపాడే సన్నివేశం అందరికి గుర్తుకు ఉండే ఉంటుంది. అనంతరం ఒక వయసు అయిన మహిళ షారుఖ్ దగ్గరికి వచ్చి.. తాయత్తు కడుతూ షారుఖ్ కి పఠాన్ అనే పేరుని ఇస్తుంది. ఈ పాత్ర చాలా చిన్నది అయిన, సినిమాలో మంచి ఇంపాక్ట్ ఉన్న రోల్. కాగా ఈ పాత్రలో కనిపించిన మహిళే.. ఆమిర్ వాళ్ళ అక్క అంట. ఈ విషయం ఆమిర్ చెప్పేవరకు బాలీవుడ్ లో కూడా ఎవరికి తెలియదు. ఇక ఇది ఇప్పుడు బయటకి రావడంతో.. ప్రస్తుతం ఆమిర్ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

ఇది ఇలా ఉంటే, ఆమిర్ ఖాన్ ఫ్యాన్స్ అంతా తన రీ ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్నారు. ‘లాల్ సింగ్ చద్దా’ డిజాస్టర్ అవ్వడంతో.. ఆమిర్ కొన్నాళ్ళు సినిమాలకు బ్రేక్ ప్రకటించారు. దీంతో ఆమిర్ స్క్రీన్ పై కనిపించిన ఆల్మోస్ట్ రెండేళ్లు అవుతుంది. తన నెక్స్ట్ సినిమా పై పలు వార్తలు వస్తున్నాయి గాని, వీటిలోనూ సరైన సమాచారం లేదు. ఇటీవల ‘తారే జమీన్ పర్’కి సీక్వెల్ గా ‘సితారే జమీన్ పర్’ రాబోతుందంటూ పేర్కొన్నారు.

2007లో ఆమిర్ దర్శకత్వంలో వచ్చినా ‘తారే జమీన్ పర్’ సూపర్ హిట్టుగా నిలిచింది. ఇప్పుడు ఆ ఎమోషనల్ హిట్టు బొమ్మకు సీక్వెల్ తీసుకు వచ్చే తారే జమీన్ పర్ సినిమా మాత్రం.. బాగా నవ్విస్తుందట. మరి ఈ చిత్రాన్ని ఎప్పుడు సెట్స్ పైకి తీసుకు వెళ్తారో చూడాలి.