Site icon HashtagU Telugu

Aamir Khan Quits Acting?: అమీర్ ఖాన్ సంచలన నిర్ణయం.. యాక్టింగ్ కు గుడ్ బై!

Aamir Khan tollywood

Amir Khan

సూపర్ స్టార్ అమీర్ ఖాన్ నటనకు విరామం ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. సోమవారం ఆయన ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరయ్యాడు. ఈ సందర్భంగా తన కెరీర్ గురించి మాట్లాడాడు. ఏడాదిన్నర పాటు నటనకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు వెల్లడించాడు. ఇందుకు  సంబంధించిన వీడియోలు, ఫొటోలు వైరల్‌గా మారాయి. అయితే అమీర్ ‘ఛాంపియన్స్’ అనే చిత్రం చేయవలసి ఉందని వెల్లడించాడు. అయితే ఇప్పుడు సినిమాలో నటించడం లేదు. కానీ దాని నిర్మాణంలో పాల్గొంటాడు.

“నేను నటుడిగా సినిమా చేస్తున్నప్పుడు, నా జీవితంలో నేను చాలా కోల్పోయాను. లాల్ సింగ్ చద్దా తర్వాత ఛాంపియన్స్ అనే సినిమా తర్వాత నేను సినిమా చేయాల్సి ఉంది. ఇది అద్భుతమైన స్క్రిప్ట్, అందమైన కథ. కానీ నేను విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నాను, నా కుటుంబంతో, నా తల్లితో, నా పిల్లలతో ఉండాలనుకుంటున్నా. వాస్తవానికి జీవితాన్ని వేరే విధంగా అనుభవించాలని భావిస్తున్న సమయం ఇది. ఎన్నో ఏళ్లుగా అంకితభావంతో సినిమాలు చేస్తున్న” అని అన్నారాయన. 35 ఏళ్ల కెరీర్‌లో నటనకు ఇది తొలి విరామం అని అమీర్ కామెంట్ చేశారు. ‘లాల్ సింగ్ చద్దా’ బాక్సాఫీస్ వద్ద ఘోరంగా నిరాశపర్చడంతో అమీర్ విరామం తీసుకోవడం చర్చనీయాంశమవుతోంది. ప్రస్తుతం అమీర్ వయసు 57 సంవత్సరాలు.