ఒకప్పుడు తెలుగు సినిమా (Telugu Movies) అంటే..తెలుగు రాష్ట్రాలకే పరిమితంగా ఉండేది..కానీ ఇప్పుడు తెలుగు సినిమా అంటే పాన్ ఇండియా రేంజ్ కి వెళ్ళింది. బాహుబలి తో పాన్ ఇండియా స్థాయి కి వెళ్లిన తెలుగు సినిమా..ఆ తర్వాత చిన్న, పెద్ద హీరోలంతా పాన్ ఇండియా సినిమాలు చేస్తూ యావత్ ప్రేక్షకులను అలరిస్తున్నారు. బాహుబలి , పుష్ప , సాహో , ఆదిపురుష్ , కల్కి , హనుమాన్ , కార్తికేయ 2 ఇలా ఒకటేంటి ఎన్నో సినిమాలు పాన్ ఇండియా గా విడుదలై బ్లాక్ బస్టర్ విజయాలు సాధించాయి.
ఇలా రోజు రోజుకు తెలుగు సినిమా స్థాయి పెరుగుతూ పోతుండడం తో బాలీవుడ్ హీరోలు సైతం మన తెలుగు డైరెక్టర్స్ తో సినిమాలు చేయాలనీ తహతహలాడుతున్నారు. ఇప్పటికే పలువురు హీరోలు తెలుగు డైరెక్టర్స్ తో సినిమాలు చేసి సక్సెస్ అందుకోగా…ఇప్పుడు బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమిర్ ఖాన్..వంశీ పైడిపల్లి (Vamsi Paidipally) తో సినిమా చేసేందుకు సిద్దమయ్యాడనే వార్తలు వినిపిస్తున్నాయి.
తాజాగా అమిర్ (Amir Khan) కు వంశీ ఓ కథ చెప్పాడట..ఆ లైన్ బాగా నచ్చడం తో దానిని ఇంకొచమ్ డెవలప్ చేయమని సూచించాడట..ప్రస్తుతం వంశీ ఆ పనిలో ఉన్నాడని ఫిలిం నగర్ జనాలు అంటున్నారు. అమిర్ కు మొదటి నుండి సౌత్ డైరెక్టర్స్ తో వర్క్ చేయాలనీ ఇంట్రస్ట్. గతంలో మురుగదాస్ తో ‘గజిని’ చేసాడు. ఇప్పుడు వంశీ పైడిపల్లికి కూడా పచ్చజెండా ఊపే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించే ఛాన్స్ వుంది.
Read Also : Vakati Narayana Reddy : వాకాటి నారాయణరెడ్డికి నరకం చూపించిన సైబర్ నేరగాళ్లు