Aamir Khan : ఆమె ఫోన్‌ కాల్ కోసం ఆమిర్ ఎదురుచూపులు.. టెన్షన్ టెన్షన్..

ప్రేమ వివాహాన్ని అమీర్ కొన్నాళ్ళు దాచి ఉంచాడు. ఇలా దాచి ఉంచడమే.. ‘ఖయామత్‌ సే ఖయామత్‌ తక్‌’ మూవీ చిత్ర యూనిట్ కి విసుగు తెప్పించింది.

Published By: HashtagU Telugu Desk
Aamir Khan Irritates Movie Unit for his Love Reena Dutta

Aamir Khan Irritates Movie Unit for his Love Reena Dutta

బాలీవుడ్(Bollywood) మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్(Aamir Khan).. రీనా దత్తని(Reena Dutta) ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ ప్రేమ వివాహాన్ని అమీర్ కొన్నాళ్ళు దాచి ఉంచాడు. ఇలా దాచి ఉంచడమే.. ‘ఖయామత్‌ సే ఖయామత్‌ తక్‌’ మూవీ చిత్ర యూనిట్ కి విసుగు తెప్పించింది. ఈ సినిమా షూటింగ్ సమయంలో ప్రేయసి ఫోన్‌ కాల్ కోసం అమీర్ చేసిన పనికి చిత్ర బృందం మొత్తం విసిగి వేసారిపోయింది. ఇంతకీ అసలు ఏం జరిగింది..? ఆమిర్ ఆమె ఫోన్‌ కాల్ కోసం ఎందుకు ఎదురు చూశాడు..? ఎందుకు టెన్షన్ పడాల్సి వచ్చింది..?

ఆమిర్‌ ఖాన్, జూహీ చావ్లా జంటగా నటించిన ‘ఖయామత్‌ సే ఖయామత్‌ తక్‌’ సినిమాకి సంబంధించిన ఒక షెడ్యూల్ షూటింగ్ ఊటీ-బెంగళూరు రహదారి పై జరిగింది. అయితే అక్కడ ఏదో సమస్య ఎదురయ్యి షూటింగ్ కి పేకప్ చెప్పేశారు. అంతేకాదు మూవీ యూనిట్ అంతా కలిసే ఇంటికి వెళ్లాలంటూ ప్రొడక్షన్‌ మేనేజర్‌ హెచ్చరించాడట. దీంతో చిత్ర బృందం అంతా ఇంటికి వెళ్లే కంగారులో ఉన్నారు. అయితే ఆ సమయంలోనే అమీర్ ప్రేయసి రీనా.. తన స్నేహితులతో కలిసి ముంబయి విహార యాత్రకు వెళ్లిందట.

ఆమిర్ అప్పటికే రీనాని పెళ్లి చేసుకున్నాడు. అయితే ఆమె ఇంకా చదువుతూ ఉండడంతో పెళ్లి విషయాన్ని బయట పెట్టలేదు. విహార యాత్రకు వెళ్లిన ప్రియురాలు సాయంత్రం అయినా ఇంటికి రాలేదని తెలుసుకున్న అమీర్.. రీనా స్నేహితురాలు నుజ్హత్‌ కు ఫోన్ చేసి అరా తీశాడట. రీనా విషయం తెలుసుకొని తన హోటల్‌ రూం ఫోన్‌ కి కాల్ చేయమని అమీర్ చెప్పాడు. దీంతో ఆ కాల్ కోసం హోటల్ లో టెన్షన్ టెన్షన్ గా వేచి చూస్తున్నాడు. మరో పక్క చిత్ర యూనిట్ ఇంటికి వెళ్ళడానికి టెన్షన్ పడుతుంది.

ఎంత సమయం అయినా అమీర్ మాత్రం ఆ హోటల్ నుంచి కదలడం లేదు. అమీర్ ప్రవర్తనకి మూవీ టీం అంతా విసుగు పోయింది. అమీర్ మాత్రం వారిని పట్టించుకోకుండా ఫోన్ కోసం వేచి చూశాడు. ఫైనల్లీ కొంత సమయానికి ఫోన్ వచ్చింది. సాంకేతిక లోపం వల్ల బస్సు ఆగిపోయిందని, రీనా రాత్రి 9 గంటలకు సురక్షితంగా ఇంటికి చేరుకుందని చెప్పారు. దీంతో ఊపిరి పీల్చుకున్న అమీర్ అక్కడి నుంచి కదిలాడు. ఈ సంఘటనతో అమీర్ రీనాల పెళ్లి విషయం చిత్రయూనిట్ కి తెలియడంతో బాలీవుడ్ అంతా పాకింది. దీంతో ఈ సినిమా రిలీజ్ తరువాత అమీర్, రీనాతో పెళ్లి గురించి బయటపెట్టాడు. అయితే 2002 లో వీరు విడాకులు తీసుకోగా అమీర్ కిరణ్ రావుని రెండో పెళ్లి చేసుకున్నాడు.

 

Also Read : Allu Sneha Reddy : బన్నీకి ముద్దు పెడుతున్న ఫోటోని షేర్ చేసిన స్నేహ..

  Last Updated: 11 Nov 2023, 07:37 AM IST