Site icon HashtagU Telugu

Aamir Khan : సౌత్ డైరెక్టర్‌ని ఇమిటేట్ చేసి నవ్వించిన ఆమిర్ ఖాన్.. వీడియో వైరల్..

Aamir Khan Imitates Sikandar Director Ar Murugadoss Video Gone Viral

Aamir Khan Imitates Sikandar Director Ar Murugadoss Video Gone Viral

Aamir Khan : యాక్టింగ్ కి కొంచెం బ్రేక్ ఇచ్చిన బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్.. సినిమాలకు మాత్రం దూరంగా లేరు. నిర్మాతగా ఏదొక సినిమాతో ఆడియన్స్ ముందుకు వస్తున్నారు. అలాగే పలు సినిమా ఈవెంట్స్ తో పాటు టాక్ షోల్లో కూడా పాల్గొంటూ ఆడియన్స్ ని పలకరిస్తూ వస్తున్నారు. తాజాగా బాలీవుడ్ సూపర్ హిట్ టాక్ షో.. కపిల్ శర్మ షోకి ఆమిర్ గెస్ట్ గా వచ్చారు. ఇక ఈ షోలో పలు ఆసక్తికర విషయాలు పై ఆమిర్ మాట్లాడుతూ వచ్చారు.

ఈక్రమంలోనే తన సూపర్ హిట్ మూవీ ‘గజినీ’ డైరెక్టర్ మురుగదాస్ గురించి మాట్లాడుతూ.. “మురగదాస్ చాలా ప్రత్యేకమైన మనిషి. పోటీగా పిల్లాడిలా కనిపిస్తాడు. నన్ను తాను మొదటిసారి కలుసుకున్నప్పుడు.. రెండు చేతులు కాళ్లు మధ్యలో పెట్టుకొని చాలా వినయంగా మాట్లాడాడు. అతని దగ్గర ఒక గొప్ప క్వాలిటీ ఉంది. తన మాటల్లో ఫిల్టర్ ఉండదు. ఎదుట ఎవరు ఉన్నా, తాను అనుకున్నది ధైర్యంగా చెప్పేస్తాడు.

ఒక సీన్ విషయంలో నేను, తనకి ఒక ఐడియా చెప్పను. అది విన్న తాను ఏమాత్రం ఆలోచించకుండా.. అసలు బాగోలేదు అని చెప్పేసాడు. అదే మనం అయితే ఆ విషయాన్ని ఎలా చెబుతాము.. ఒకే సార్, కానీ అలాకాకుండా ఇలా చేస్తే ఇంకా బాగుంటుంది అని చెబుతూ సున్నితంగా తిరస్కరిస్తాము. కానీ మురగదాస్ అలా కాదు. అసలు బాగోలేదు సార్ అని మొహం మీద చెప్పేస్తాడు. ఒకవేళ ఐడియా బాగుంటే.. సూపర్ సార్ అంటూ అదే ఎనర్జీతో చెబుతాడు” అంటూ మురగదాస్ ఎలా మాట్లాడతాడో యాక్ట్ చేసి చెప్పుకొచ్చాడు.

ఇక ఆమిర్ ఇమిటేషన్ చూసి అందరూ నవ్వుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. కాగా మురగదాస్ తన నెక్స్ట్ సినిమాని బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ తో చేస్తున్నారు. ఆ చిత్రానికి ‘సికందర్’ అనే టైటిల్ ని పెట్టారు.