Site icon HashtagU Telugu

Aamir Khan: బాలీవుడ్ స్టార్ హీరోని రిక్వెస్ట్ చేసిన ఫ్యాన్స్.. డ్రగ్స్ తీసుకోవడం మానేయండంటూ?

Mixcollage 08 Mar 2024 08 16 Am 1047

Mixcollage 08 Mar 2024 08 16 Am 1047

తెలుగు ప్రేక్షకులకు బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు కమర్షియల్ యాడ్స్ లో నటిస్తూ బాగానే గుర్తింపు తెచ్చుకున్నారు అమీర్ ఖాన్. అలాగే ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి ఇండస్ట్రీలో అగ్రస్థానంలో ఉన్నారు అమీర్ ఖాన్. ఇకపోతే ఇటీవల కాలంలో ఆయన నటించిన చిత్రాలు వరుస డిజాస్టర్స్ అవుతున్నాయి. చివరగా లాల్ సింగ్ చద్దా సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో తన రాబోయే సినిమాలపై మరింత శ్రద్ధ పెట్టాడు అమీర్ ఖాన్.

కొన్ని రోజులుగా సైలెంట్ గా ఉంటున్నారు అమీర్. ప్రస్తుతం సితారే జమీన్ పర్ సినిమాలో నటిస్తున్నారు. ఈ మూవీ కొన్ని నెలలుగా వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ క్రమంలోనే తాజాగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించారు అమీర్ ఖాన్. ఇన్ స్టాలో లైవ్ ద్వారా క్వశ్చన్ సెషన్ నిర్వహించారు. అదే సమయంలో అభిమానుల నుంచి ఊహించని ప్రశ్నలు ఎదురయ్యాయి. ఖాన్ ను ట్రోల్ చేస్తూ.. అగౌరవపరుస్తూ కామెంట్స్ వచ్చినా అమీర్ ఎంతో సహానంగా అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఇన్ స్టా లైవ్ లో ఉన్న సమయంలో అమీర్ ఖాన్ ముఖం గుర్తుపట్టడానికి వీల్లేదుగా కనిపిస్తుంది.

ముఖం, కళ్లు అంతా ఉబ్బిపోయి కనిపించాయి. దీంతో ఓ నెటిజన్ ఊహించని క్వశ్చన్ చేశాడు. సార్.. మీరు డ్రగ్స్ తీసుకున్నట్లు ఉన్నారు.. ప్లీజ్ సర్ డ్రగ్స్ తీసుకోవడం మానేయండి అంటూ కామెంట్స్ చేశాడు. అయితే ఈ కామెంట్ పై అమీర్ స్పందిస్తూ నెటిజన్ ప్రశ్నకు మర్యాద పూర్వకంగా క్లారిటీ ఇచ్చారు. నేను డ్రగ్స్ తీసుకోలేదు. ఆ అలవాటు నాకు లేదు అని తెలిపారు అమీర్ ఖాన్. ఇంతలోనే మరో నెటిజెన్ తన స్టైలీస్ట్ ను మార్చుకోవాలని సూచించాడు. తన స్టైల్, శైలి వేరని కాబట్టి చాలా మందికి నచ్చదు అని అమీర్ ఖాన్ అన్నారు.

Exit mobile version