Site icon HashtagU Telugu

2023 World Cup Effect : వరల్డ్ కప్ దెబ్బ కు ‘ఆదికేశవ’ వెనక్కు

Aadhikesav

Aadhikesav

వరల్డ్ కప్ దెబ్బ మెగా హీరోకు తగిలింది. మెగా హీరో వైష్ణవ్ తేజ్ (Vaishnav tej) – శ్రీలీల (Sreeleela) జంటగా నాగ వంశీ నిర్మాణం లో తెరకెక్కిన మూవీ ‘ఆదికేశవ’ (Aadikeshava). దీపావళి కానుకగా నవంబర్ 10న విడుదల చేయాలనీ చిత్ర మేకర్స్ చూసారు. కానీ ఇప్పుడు తమ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నారు. ప్రస్తుతం వరల్డ్ కప్ (2023 World Cup) మేనియా నడుస్తుంది. టీం ఇండియా (India) ఎక్కడ తగ్గేదెలా అంటూ వరుస విజయాలతో దూసుకెళ్తుంది. ఇప్పటికే సెమీ ఫైనల్స్ లిస్టులోకి వెళ్ళింది. ఆరు మ్యాచుల్లో వరుస విజయాలు సాధించి అందరి చేత హాట్ ఫేవరేట్ అనిపించుకుంది.

నవంబర్ 12న ఇండియా వర్సెస్ నెదర్లాండ్స్ మ్యాచ్ ఉంది. నవంబర్ 15, 16వ తేదీల్లో సెమీ ఫైనల్స్ జరగనున్నాయి. ఈ క్రమంలో ‘ఆదికేశవ’ ను విడుదల చేస్తే సినిమాను చూసేందుకు పెద్దగా ఇంట్రస్ట్ చూపించారని భావించిన మేకర్స్..సినిమాను ఈ నెల 24న విడుదల చేయనున్నట్లు నాగవంశీ తెలిపారు. ‘ఆదికేశవ’ చిత్రానికి సూర్యదేవర నాగ వంశీ, ఎస్. సాయి సౌజన్య నిర్మాతలు. శ్రీకర స్టూడియోస్‌ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ ఫోర్‌ సినిమాస్ నిర్మాణ సంస్థలు తెరకెక్కించాయి.

Read Also : Pre-Election Cash : అభ్యర్థుల నామినేషన్స్ షురూ కాలేదు అప్పుడే రూ.400 కోట్లు సీజ్..