Site icon HashtagU Telugu

Tollywood: అజిత్, విజయ్ సినిమాల్లో విలన్‏గా చేయాలని ఉంది.. క్రేజీ కామెంట్స్ చేసిన టాలీవుడ్ హీరో!

Tollywood

Tollywood

టాలీవుడ్ ప్రముఖ హీరో తనకు హీరోగా నటించడం కంటే విలన్ గా నటించడమే చాలా ఇష్టం అని అంటున్నారు. అంతేకాకుండా సదురు టాలీవుడ్ హీరోకి కోలీవుడ్ స్టార్ హీరోలు అయినా అజిత్, విజయ దళపతి సినిమాలలో విలన్ గా నటించాలని ఉంది అంటూ తన కోరికను బయట పెట్టారు. దీంతో అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఆ హీరో ఎవరో ఏంటి అన్న వివరాల్లోకి వెళితే.. ఆ హీరో మరెవరో కాదండోయ్ నటుడు ఆది. అదేనండోయ్ టాలీవుడ్ హీరో ఆది పినిశెట్టి. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నారు ఆది పినిశెట్టి.

అందులో భాగంగానే ఇప్పుడు దర్శకుడు అరివళగన్ దర్శకత్వం వహించే సప్తం చిత్రంలో నటిస్తున్నాడు. ఆయనతో పాటు, నటులు లక్ష్మీ మీనన్, లైలా, సిమ్రాన్, ఎం.ఎస్. భాస్కర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని 7జీ ఫిల్మ్స్ నిర్మిస్తోంది. ఈ సినిమా ధ్వనిపై కేంద్రీకృతమైన హారర్ థ్రిల్లర్ శైలిలో రూపొందించబడింది. దర్శకుడు అరివజగన్ అభిమానులను మంచి సౌండ్ సిస్టమ్ ఉన్న థియేటర్లలో సినిమా చూడమని అభ్యర్థించారు. కాగా ఈ సినిమా 2025 ఫిబ్రవరి 28న థియేటర్లలో కూడా విడుదలైన విషయం తేలిసిందే. ఈ చిత్రానికి అభిమానుల నుండి మిశ్రమ స్పందనలు లభించాయి. ఇకపోతే ఈ సినిమా విడుదల సమయంలో ఒక ప్రెస్ మీట్ లో పాల్గొన్న ఆది పినిశెట్టి ఆ సందర్భంగా మాట్లాడుతూ క్రేజీ కామెంట్స్ చేసారు.

ఈ సందర్భంగా ఆది పినిశెట్టి మాట్లాడుతూ.. దర్శకుడు అరివజగన్ దర్శకత్వం వహించిన నా రెండవ చిత్రం ఈరంలో నేను నటించాను. ఆ సమయంలో ఆయన ఆలోచనలు ప్రత్యేకమైనవి. ఇప్పుడు మనం మళ్ళీ కలిసి పనిచేసినప్పుడు మనకు మంచి అవగాహన ఉంది. అరివజగన్ దర్శకత్వం, కథ పట్ల ఆయన చూపిన శ్రద్ధ అన్నీ నన్ను ఆకట్టుకుంటాయి అని తెలిపారు. అప్పుడు కలెక్టర్ దగ్గర ఉద్యోగం ఇప్పుడు స్టార్ కమెడియన్.

తనకు తమిళ, తెలుగు చిత్రాల మధ్య తేడా లేదని, సప్తం సినిమా తర్వాత, మరగత నానయం 2 సినిమాతో సహా పలు తమిళ చిత్రాలు త్వరలో విడుదల కానున్నాయని ఆది అన్నారు. హీరోగా కాకుండా విలన్‌ గా నటించడానికే నేను ఇష్టపడతాను. ఎందుకంటే విలన్ పాత్రలకు పరిమితులు తక్కువగా ఉంటాయి. ఆసక్తికరంగా ఉంటాయి. ముఖ్యంగా అజిత్, విజయ్ వంటి పెద్ద స్టార్ల ముందు విలన్ గా నటించాలనుకుంటున్నాను. కానీ స్క్రిప్ట్ దానిని నిర్ణయిస్తుందని అని నటుడు ఆది అన్నారు. ఈ సందర్భంగా ఆది చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Exit mobile version