Aadi Saikumar : ఎయిర్‌పోర్టులో పెళ్లిచూపులు .. హనీమూన్‌లో గొడవ.. ఆది సాయికుమార్ మ్యారేజ్ లైఫ్!

2014లో ఆది.. అరుణ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరి పెళ్లి గురించి కొన్ని విషయాలను ఆది ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నాడు.

Published By: HashtagU Telugu Desk
Aadi Saikumar marriage interesting facts

Aadi Saikumar marriage interesting facts

సీనియర్ హీరో సాయి కుమార్(Sai Kumar) వారసుడిగా వెండితెరకు పరిచయమైన హీరో ఆది సాయికుమార్(Aadi Saikumar). 2011 లో ‘ప్రేమకావాలి'(Prema Kavali) సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. లవ్ అండ్ రొమాంటిక్ యాక్షన్ ఫిలింగా వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాకి ఫిలిం ఫేర్ అవార్డుని కూడా సొంతం చేసుకున్నాడు. ఇక ఆ తరువాత లవ్లీ, సుకుమారుడు వంటి యూత్ ఫుల్ సినిమాలతో కూడా మంచి సక్సెస్ ని అందుకున్నాడు. దీంతో టాలీవుడ్ లో హీరోగా మంచి గుర్తింపుని తెచ్చుకున్నాడు. ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తూ ఫుల్ బిజీ యాక్టర్ గా ఉన్నాడు.

ఇక 2014లో ఆది.. అరుణ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరి పెళ్లి గురించి కొన్ని విషయాలను ఆది ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నాడు. వీరిద్దరి పరిచయం ఆది వాళ్ళ సిస్టర్ పెళ్లిలో జరిగిందట. ఆది సిస్టర్ మావయ్య ఫ్రెండ్ అరుణ వాళ్ల నాన్న. ఆ పెళ్ళిలో ఆదిని చూసిన అరుణ వాళ్ల నాన్న పెళ్లి ప్రపోజల్‌ పెట్టారట. ఇక వీళ్లిద్దరి పెళ్లిచూపులు హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో జరిగిందట. సాయి కుమార్ ఎక్కడికో వెళ్ళడానికి ఎయిర్‌పోర్టుకి వచ్చాడట. అదే సమయంలో అరుణ పేరెంట్స్ కూడా ఎయిర్‌పోర్టులో ఉన్నారు.

ఇద్దరు పేరెంట్స్ కలుసుకోవడంతో ఆది అండ్ అరుణని ఎయిర్‌పోర్టుకి పిలిపించారు. ఇక అక్కడ జరిగిన పెళ్లి చూపులో ఆది.. తన ప్రొఫెషన్ అండ్ దానిలో ఉండే సమస్యలు చెప్పాడట. ఆ తరువాత నెంబర్స్ మార్చుకొని నాలుగు నెలలు పాటు ఫోన్ ల్లో గంటల తరబడి మాట్లాడుకునేవారట. ఆ తరువాత పెళ్లి చేసుకున్న వారిద్దరి మధ్య మొదటి గొడవ హనీమూన్‌‌లోనే జరిగినట్లు చెప్పుకొచ్చాడు. ఎందుకు గొడవ అయ్యిందో అన్న విషయం ఇద్దరికీ గుర్తు లేదని, హనీమూన్‌లోనే మొదటి గొడవ జరగడంతో బాగా గుర్తుకు ఉన్నట్లు చెప్పుకొచ్చాడు. ఇక గొడవ అయ్యినప్పుడు తప్పు ఎవరిది ఉన్నా ముందుగా సారీ అరుణనే చెబుతుందట. ఆది తప్పు తనది అయితేనే చెబుతాడట. ప్రస్తుతం వీరిద్దరికి ఒక పాప కూడా ఉంది. వీరు మ్యారేజ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు.

 

Also Read : Dhanush New look: కొత్త లుక్ లో ధనుష్.. రామ్ దేవ్ బాబా అంటూ నెటిజన్స్ ట్రోల్స్!

  Last Updated: 29 May 2023, 09:02 PM IST