Site icon HashtagU Telugu

Divorce : విడాకుల పై ఆది పినిశెట్టి క్లారిటీ

Adi Pini Shetty Divorce

Adi Pini Shetty Divorce

సినీ సెలబ్రిటీల వ్యక్తిగత జీవితం గురించి అనేక రూమర్లు రావడం కొత్తేమీ కాదు. కానీ ఇటీవలి కాలంలో దక్షిణాది సినీ పరిశ్రమలో విడాకుల వార్తలు పెరిగిపోతున్నాయి. బాలీవుడ్‌లోనే ఎక్కువగా కనిపించే ఈ ట్రెండ్ ఇప్పుడు టాలీవుడ్, కోలీవుడ్‌లలోనూ కనిపిస్తోంది. గతంలో నాగచైతన్య-సమంత, ధనుష్-ఐశ్వర్య వంటి ప్రముఖ జంటలు విడిపోయిన తర్వాత, ఏ దంపతుల గురించిన విడాకుల వార్తలైనా నమ్మేయడం ప్రేక్షకుల అలవాటుగా మారింది. ఇటీవల సూర్య-జ్యోతిక గురించి కూడా ఇదే తరహా పుకార్లు వచ్చినా వారు అన్యోన్యంగా ఉంటూ ఆ వదంతులకు చెక్ పెట్టారు.

Telugu Boards : ఉత్తరప్రదేశ్ లో తెలుగు బోర్డులు

ఈ నేపథ్యంలో హీరో ఆది పినిశెట్టి (Adi Pini Shetty), నిక్కీ గల్రాని విడాకులు తీసుకోబోతున్నారని సోషల్ మీడియాలో ప్రచారం ఊపందుకుంది. ఈ వార్తలు వారి కుటుంబాన్ని తీవ్రంగా కలవరపెట్టాయి. అయితే ఈ రూమర్లపై స్వయంగా ఆది స్పందిస్తూ తాము విడిపోవట్లేదని, ఎంతో సంతోషంగా ఉన్నామని స్పష్టం చేశాడు. నిక్కీ తనకు మంచి ఫ్రెండ్ మాత్రమే కాకుండా, తన కుటుంబానికి ఎంతో దగ్గరయ్యారని, పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నామని చెప్పాడు. కానీ యూట్యూబ్ ఛానెల్లు, కొన్ని మీడియా వర్గాలు నిరాధారమైన వార్తలు రాస్తూ, క్లిక్స్ కోసం తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశాడు.

Mahakumbh: మ‌హా కుంభ‌మేళా.. 45 రోజుల్లో 65 కోట్ల మందికి పైగా భ‌క్తులు!

‘‘మొదట ఇటువంటి వార్తలు చూసి చాలా కోపం వచ్చింది. కానీ ఆ ఛానెళ్ల పనితనం అర్థమైన తర్వాత పట్టించుకోవాల్సిన అవసరం లేదనిపించింది. ఈ రూమర్లకు స్పష్టత ఇచ్చే అవసరం లేకపోయినా, అభిమానుల కోసం ఈ క్లారిటీ ఇచ్చాను’’ అని ఆది పినిశెట్టి పేర్కొన్నాడు. ప్రస్తుతం ఆయన హీరోగా నటించిన ‘శబ్దం’ సినిమా ఈ శుక్రవారం విడుదల కానుంది. ఈ రూమర్లతో వ్యక్తిగత జీవితంపై వచ్చిన దుష్ప్రచారాన్ని తేలికగా తీసుకున్న ఆది, తన కెరీర్‌పై దృష్టిపెట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.