తెలుగు ప్రేక్షకులకు నిక్కీ గల్రానీ, ఆది పినిశెట్టి ల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈ జంట ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇద్దరు కూడా ఎవరికి వారు సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇకపోతే ఆది పినిశెట్టి తాజాగా నటించిన చిత్రం శబ్దం.. ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆది పినిశెట్టి ప్రస్తుతం సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలలో బిజీ బిజీగా ఉన్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ సినిమాకు సంబంధించిన విషయాలతో పాటుగా తన వ్యక్తిగత జీవితం గురించి సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తలపై సైతం స్పందించారు.
ఈ సందర్భంగా ఆది పినిశెట్టి మాట్లాడుతూ.. నిక్కీ నాకు మొదట మంచి స్నేహితురాలు. నా కుటుంబ సభ్యులకు కూడా ఆమె ఎంతో దగ్గరయింది. మా ఇంట్లో వాళ్లు ఆమెకు బాగా నచ్చారు. ఆమెతో ఉంటే నేను సంతోషంగా ఉంటానని అనిపించింది. దీంతో పెద్దల అంగీకారంతోనే మేము వివాహం చేసుకున్నాము. సంతోషంగా జీవితాన్ని కొనసాగిస్తున్నాము. అయితే, మేమిద్దరం విడాకులు తీసుకుంటున్నామని యూట్యూబ్ లో కథనాలు వచ్చాయి. మొదట వాటిని చూసి నేను షాకయ్యాను.
బాగా కోపం కూడా వచ్చింది. ఆ తర్వాత ఆయా ఖాతాల్లో ఉన్న పాత వీడియోలు చూసి ఇలాంటి వాళ్లను పట్టించుకోకపోవడం మంచిది అనిపించింది. క్లిక్స్ కోసం ఎంతకైనా తెగిస్తారని అర్థమైంది అని ఆది పిని శెట్టి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరి ఇప్పటికైనా ఈ వార్తలకు ముగింపు పలుకుతారేమో చూడాలి మరి. ఇకపోతే శబ్దం సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమా ఈ నెల 28న విడుదల కానుంది. ఈ సినిమాకు అరివళగన్ దర్శకత్వం వహించారు. 7జి ఫిల్మ్స్ శివ నిర్మించారు. సిమ్రాన్, లైలా, లక్ష్మీమేనన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.