Site icon HashtagU Telugu

Aadhi Pinisetty: ‘ఆది-నిక్కీ గల్రానీ’ ఎగేంజ్ మెంట్.. పిక్స్ వైరల్!

Aadi

Aadi

నటుడు ఆది పినిశెట్టి, నిక్కీ గల్రానీ ప్రేమించుకుంటున్నారని, త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ పుకార్లన్నీ నిజం చేసింది ఈ జంట. త్వరలోనే పెళ్లితో ఒక్కటికాబోతున్నారు. ఈ మేరకు ఇద్దరూ మార్చి 24న నిశ్చితార్థం చేసుకున్నారు. శనివారం తమ ఇన్‌స్టాగ్రామ్ లో ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రత్యేక రోజుగా పేర్కొంటూ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. మేం కొన్ని సంవత్సరాల క్రితం ఇద్దరి ఇష్టాయిష్టాలను తెలుసుకున్నాం. మేం ఈ కొత్త ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నాం.. మీ అందరి ప్రేమ, ఆశీర్వాదాలను కోరుతున్నాం. ఈ రోజు మాకు చాలా ప్రత్యేకమైనది’’ అని షేర్ చేశారు.

తమ కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం చేసుకున్నట్లు ఈ జంట అభిమానులకు తెలియజేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను షేర్ చేశారు. ప్రస్తుతం ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్  అవుతున్నాయి. ‘యాగవరైనమ్‌ నా కక్కా’అనే తమిళ సినిమాలో ఆది పినిశెట్టి సరసన నిక్కీ నటించింది. ఈ చిత్రం తెలుగులోను ‘మలుపు’ పేరుతో విడుదలైంది. ఆ షూటింగ్‌ సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారని తెలుస్తుంది. ‘గుండెల్లో గోదారి’ మూవీతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు ఆది పినిశెట్టి.  ‘సరైనోడు’,‘నిన్ను కోరి’,’రంగస్థలం’ చిత్రాలు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి.