శివాజీకి వార్నింగ్ ? అనసూయకు సపోర్ట్ గా ప్రకాష్‌ రాజ్‌..!

హీరోయిన్ల డ్రెస్సింగ్ పై శివాజీ చేసిన వ్యాఖ్యలపై ప్రకాష్ రాజ్ తీవ్రంగా స్పందించారు. ‘ఆడవాళ్లంటే ఏమనుకుంటున్నారు? ఆ భాష ఏంటి?’ అంటూ శివాజీని నిలదీశారు. అనసూయకు మద్దతు తెలుపుతూ, మహిళల వస్త్రధారణపై తీర్పులు చెప్పే హక్కు ఎవరికీ లేదని, శివాజీ మాటలు సభ్య సమాజానికి తగవని ప్రకాష్ రాజ్ అన్నారు. నాగబాబు కూడా శివాజీ వ్యాఖ్యలను ఖండించారు. యాక్టర్ శివాజీ ఇటీవల ‘దండోరా’ ఈవెంట్ లో చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్నాయి. హీరోయిన్ల డ్రెస్సింగ్ పై […]

Published By: HashtagU Telugu Desk
Prakash Raj Reaction On Siv

Prakash Raj Reaction On Sivaji

హీరోయిన్ల డ్రెస్సింగ్ పై శివాజీ చేసిన వ్యాఖ్యలపై ప్రకాష్ రాజ్ తీవ్రంగా స్పందించారు. ‘ఆడవాళ్లంటే ఏమనుకుంటున్నారు? ఆ భాష ఏంటి?’ అంటూ శివాజీని నిలదీశారు. అనసూయకు మద్దతు తెలుపుతూ, మహిళల వస్త్రధారణపై తీర్పులు చెప్పే హక్కు ఎవరికీ లేదని, శివాజీ మాటలు సభ్య సమాజానికి తగవని ప్రకాష్ రాజ్ అన్నారు. నాగబాబు కూడా శివాజీ వ్యాఖ్యలను ఖండించారు.

యాక్టర్ శివాజీ ఇటీవల ‘దండోరా’ ఈవెంట్ లో చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్నాయి. హీరోయిన్ల డ్రెస్సింగ్ పై మాట్లాడుతూ ‘సామాన్లు’, ‘దరిద్రపు ముం**’ వంటి పదప్రయోగం చేయడంపై సినీ ప్రముఖులు ఫైర్ అవుతున్నారు. అనసూయ భరద్వాజ్, చిన్మయి శ్రీపాదతో సహా అనేకమంది సెలబ్రిటీలు శివాజీ వ్యాఖ్యలను ఖండించారు. మరోవైపు శివాజీ తన స్టేట్మెంట్ ను సమర్థించుకుంటూ, అనసూయపై వ్యంగ్యంగా మాట్లాడటంతో ఈ వివాదం మరింత ముదిరింది. తాజాగా శివాజీ వివాదంపై నటుడు ప్రకాష్ రాజ్ స్పందించారు.

శివాజీ వ్యాఖ్యలను ఎవరూ సమర్థించరని, అతను చాలా చెత్తగా మాట్లాడాడని ప్రకాష్ రాజ్ మండిపడ్డారు. ”ఆడవాళ్లు అంటే మీరు ఏమనుకుంటున్నారు? ఆ భాష ఏంటి? మీలో ఉన్నదేగా బయటకి వస్తుంది. ఆడవాళ్లపై ఆ మాటలేంటి? ఆ అహంకారం ఏంటి? తరతరాలుగా ఆడవాళ్లకి మగవాళ్ల నుంచే కదా అన్యాయం జరుగుతోంది. ఒక వేదిక మీద మాట్లాడుతున్నప్పుడు నీకు సంస్కారం ఉండాలి” అంటూ ప్రకాష్ రాజ్ ఫైర్ అయ్యారు. అనసూయకు తన మద్దతు ఉంటుందని చెప్పారు.

ఆమెను (అనసూయ) ఆంటీ అంటున్నారు. ఆ భాష ఏంటి?. ఆడవాళ్ల బాడీ పార్ట్స్ పై కామెంట్స్ చేయడం తప్ప, తెలుగులో ఇంకేమీ రాదు వాళ్లకి. బాడీ పార్ట్స్ గురించే వాళ్లు మాట్లాడతారు. ఎంత సంస్కారులు అనుకొని మాట్లాడుతున్నారో.. అది అంత అసహ్యం. అనసూయని, అనసూయ లాంటి వారిని నేను సపోర్ట్ చేస్తాను. ఆడవాళ్లకి సపోర్ట్ చేయడం నా బాధ్యత. అది మా కర్తవ్యం. శివాజీ కానీ, ఎవరైనా గానీ.. ఒక వేదిక మీద మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలి. మీకు భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. కానీ ఒక ఎలా చెప్పాలి, ఏ విధంగా మాట్లాడాలి అనేది తెలియాలి అని ప్రకాష్ రాజ్ అన్నారు.

శివాజీ ఇప్పటికే సారీ చెప్పాడు. కానీ మిగతా వాళ్లు వదలరు. అనసూయని స్ట్రాంగ్ గా ఉండమని చెబుతూ ట్వీట్ చేశాను. ఆ సంస్కారుల అసహ్యం నాకు తెలుస్తోంది. నన్నూ అలానే తిడుతుంటారు. ప్రకాష్ రాజ్ మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? అని అడగరు. అమ్మని, చెల్లిని, కూతురుని లాగుతారు. వాళ్ల బ్రెయిన్ అంతే. అక్కడే మాట్లాడతారు. కచ్చితంగా శివాజీ అన్న మాటలు చాలా తప్పు. ఒక సభ్యసమాజంలో అలా మాట్లాడకూడదు. అసలు నువ్వెవరు చెప్పడానికి? ఫస్ట్ నీ ద్రుష్టి మార్చుకో. అమ్మాయిలను గిల్లేది మగవాళ్లే కదా.. ఆడవాళ్లు కాదుగా. ‘పోకిరి’ సినిమాలో మాదిరిగా గిల్లితే గిల్లించుకోవాలి అని చెప్తారా?. అది అన్యాయం. చాలా తప్పు అని ప్రకాష్ రాజ్ అన్నారు.

క అనసూయ ట్వీట్ పై ప్రకాష్ రాజ్ స్పందిస్తూ.. ”ఆ సంస్కారవంతులను మొరుగుతూనే ఉండనివ్వండి. అది వాళ్ళ నీచమైన మనస్తత్వం. డియర్ అనసూయ, నువ్వు ధైర్యంగా నిలబడు. మేము నీకు అండగా ఉన్నాం. నీకు మరింత శక్తి చేకూరాలని కోరుకుంటున్నాను” అని పేర్కొన్నారు. మరోవైపు శివాజీ వ్యాఖ్యలను మెగా బ్రదర్ నాగబాబు ఖండించారు. మహిళలు ఎలా ఉండాలి, ఏ దుస్తులు ధరించాలి అన్నది నిర్ణయించే హక్కు ఎవరికీ లేదని ఆయన అన్నారు. మహిళల ప్రవర్తన, వస్త్రధారణపై ప్రతి ఒక్కరూ తీర్పులు చెప్పే ధోరణి రాజ్యాంగ విరుద్ధమని అభిప్రాయపడ్డారు.

 

  Last Updated: 27 Dec 2025, 04:28 PM IST