Rajamouli About RRR: ఆర్‌ఆర్‌ఆర్ బాలీవుడ్ సినిమా కాదు.. సౌత్ ఇండియాకు చెందిన తెలుగు సినిమా: రాజమౌళి

తెలుగు దర్శకుడు తెరెకెక్కించిన ఆర్‌ఆర్‌ఆర్ (RRR) సినిమా ప్రపంచ వ్యాప్తంగా సత్తా చాటుతోంది. ఇప్పటికే ఇండియాలో సంచనల విజయాన్ని అందుకున్న ఈ చిత్రం ప్రస్తుతం విదేశాల్లోనూ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది.

  • Written By:
  • Publish Date - January 15, 2023 / 05:22 PM IST

తెలుగు దర్శకుడు తెరెకెక్కించిన ఆర్‌ఆర్‌ఆర్ (RRR) సినిమా ప్రపంచ వ్యాప్తంగా సత్తా చాటుతోంది. ఇప్పటికే ఇండియాలో సంచనల విజయాన్ని అందుకున్న ఈ చిత్రం ప్రస్తుతం విదేశాల్లోనూ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. జపాన్ లాంటి దేశాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ సినిమాగా సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. రూ. 500 కోట్లతో తెరకెక్కిన ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా రూ. 1200 కోట్లు సాధించింది. అయితే ఈ చిత్రం బాలీవుడ్ సినిమా కాదని, దక్షిణ భారతదేశం నుండి వచ్చిన తెలుగు సినిమా అని అమెరికన్ జర్నలిస్టులకి స్పష్టం చేశాడు. అమెరికాలోని డైరెక్టర్స్ గిల్డ్‌లో తన సినిమా ప్రదర్శన అనంతరం రాజమౌళి జర్నలిస్టుల బృందంతో మాట్లాడారు.

దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ.. “ఆర్‌ఆర్‌ఆర్ బాలీవుడ్ సినిమా కాదు. దక్షిణాది నుండి వచ్చిన తెలుగు సినిమా. అయితే సినిమాని ఆపి మీకు సంగీతం అందించడం కంటే కథను ముందుకు తీసుకెళ్లడానికి నాటు నాటు పాటను ఉపయోగించాను. అటు మూడు గంటల సినిమా చూస్తుండగానే అయిపోందని ప్రదర్శనకు వచ్చిన సినీ ప్రముఖులు చెప్పడం పట్ల రాజమౌళి సంతోషం వ్యక్తం చేశారు. “సినిమా చివరలో మూడు గంటలు అనిపించలేదని మీరు చెప్పడం సంతోషంగా ఉంది. మీకు ఆ ఫీలింగ్ కలిగిందంటే నేను విజయవంతమైన ఫిల్మ్ మేకర్ అని భావిస్తున్నా అన్నారు.

Also Read: Gympie-gympie: పాము కంటే విషపూరితమైన “సూసైడ్ ప్లాంట్” వివరాలివీ

తాజాగా ఈ చిత్రం ప్రతిష్టాత్మక ‘గోల్డెన్ గ్లోబ్’ అవార్డును దక్కించుకుంది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ‘నాటు నాటు’ పాట ఈ అవార్డును అందుకుంది. ఈ కేటగిరీలో అవార్డు పొందిన మొదటి భారతీయ పాటగా నిలిచింది.చిత్ర సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి అవార్డును తీసుకున్నారు. 2022లో విడుదలైన ‘ఆర్ఆర్ఆర్’ పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కింది. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, అజయ్ దేవగన్, అలియా భట్, శ్రియ శరణ్ ప్రధాన పాత్రలు పోషించారు.