K Viswanath Biography: ప్రతీ సినిమా ఓ సాగర సంగమమే!

ప్రముఖ దర్శకుడు కళాతపస్వి కె.విశ్వనాథ్‌ కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం రాత్రి తుది శ్వాస విడిచారు.

  • Written By:
  • Updated On - February 3, 2023 / 12:54 PM IST

ప్రముఖ దర్శకుడు కళాతపస్వి కె.విశ్వనాథ్‌ కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం రాత్రి తుది శ్వాస విడిచారు. దీంతో టాలీవుడ్‌లో విషాదం అలముకుంది. విశ్వనాథ్‌ మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. సాగర సంగమం, స్వాతిముత్యం, సిరిసిరిమువ్వ, శ్రుతిలయలు, సిరివెన్నెల, ఆపద్బాంధవుడు,శంకరాభరణం లాంటి ఆణిముత్యాలను తెలుగు చిత్రసీమకు అందించారు. ఎన్నో అవార్డులను అందుకున్నారు. సినీ రంగంలో ఆయన కృషికి 2016 లో చిత్ర పరిశ్రమలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు వచ్చింది. 1992లో రఘుపతి వెంకయ్య అవార్డు, అదే ఏడాదిలో పద్మశ్రీ పురస్కారాలను అందుకున్నారు. విశ్వనాథ్‌ చిత్రాల్లో ఎంతో పేరుగాంచిన స్వాతిముత్యం సినిమా ప్రఖ్యాత ఆస్కార్‌ (59వ)చిత్రాల బరిలో నిలిచింది. ఆసియా పసిఫిక్‌ చలన చిత్ర వేడుకల్లో స్వాతిముత్యం, సాగరసంగమం, సిరివెన్నెల చిత్రాలు ప్రదర్శితమయ్యాయి. మాస్కోలో జరిగిన చలన చిత్ర వేడుకల్లో స్వయంకృషి సినిమా ప్రదర్శితమైంది.

కళాత్మక సినిమా తీయడమే కష్టం

కమర్షియల్ సినిమా ఎవరైనా తీస్తారు.. కళాత్మక సినిమా తీయడమే కష్టం. అలాంటి కష్టాన్ని ఎంతో ఇష్టంగా మార్చుకొని సినిమాలు తీసిన గొప్ప వ్యక్తి కె.విశ్వనాధ్. ఆయన తీసిన ఆణిముత్యాల్లాంటి సినిమాల్లో అడుగడుగునా ప్రయోగాలే కనిపిస్తాయి. ఇలా కూడా సినిమాలు తీయొచ్చా, అప్పట్లోనే ఇంత సాహసం చేశారా, అసలు ఇంత ధైర్యం ఎలా వచ్చింది లాంటి ఎన్నో సందేహాల మధ్య, ఇంకెంతో ఆశ్చర్యం కలుగుతుంది విశ్వనాధ్ సినిమాలు చూస్తే. శంకరాభరణం.. కె.విశ్వనాధ్ కెరీర్ లోనే కాదు, తెలుగు సినీ చరిత్రలోనే ఆణిముత్యాల్లో ఒకటి. ఇలాంటి సినిమా తీయాలని ఎవ్వరూ అనుకోరు. అలా అనుకోవడమే మొదటి విజయం. తెలుగు సినిమాను మలుపుతిప్పిన ఈ చిత్రరాజం ఎన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డుల్ని అందుకుంది. నిజానికి ఇదొక పెద్ద ప్రయోగం. కథ నుంచి నటీనటుల ఎంపిక వరకు ప్రతి విషయంలో ప్రయోగం కనిపిస్తుంది.

బాల్యం.. విద్యాభ్యాసం..

♦కె.విశ్వనాథ్‌ స్వస్థలం బాపట్ల జిల్లా రేపల్లెలోని పెద పులివర్రు గ్రామం.
♦1930 ఫిబ్రవరి 19న కాశీనాథుని సుబ్రహ్మణ్యం, సరస్వతమ్మ దంపతులకు విశ్వనాథ్‌ జన్మించారు.
♦గుంటూరు హిందూ కళాశాలలో ఇంటర్మీడియట్‌, ఆంధ్రా క్రిస్టియన్‌ కళాశాలలో బీఎస్సీ పూర్తి చేశారు.
♦ఆయన తండ్రి చెన్నైలోని విజయవాహినీ స్టూడియోలో పనిచేసేవారు.

సినీ కెరీర్
♦ విశ్వనాథ్‌ డిగ్రీ పూర్తవగానే అదే స్టూడియోలో సౌండ్‌ రికార్డిస్ట్‌గా సినీ జీవితాన్ని ప్రారంభించారు.
♦తొలిసారి పాతాళభైరవి సినిమాకు అసిస్టెంట్‌ రికార్డిస్ట్‌గా పనిచేశారు.
♦1965లో ‘ఆత్మగౌరవం’ సినిమాకు దర్శకుడిగా అవకాశం లభించింది.
♦తొలి చిత్రానికే ఆయనకు నంది అవార్డు అందుకున్నారు.
♦50కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు.
♦టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ 9 చిత్రాలకు విశ్వనాథ్‌ దర్శకత్వ బాధ్యతలు వహించారు.
♦ఎన్నో చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు.

కళాతపస్వి కె. విశ్వనాథ్ చిత్రావళి

ఆత్మ గౌరవం (1965)
ప్రైవేట్ మాస్టర్ (1967)
కలిసొచ్చిన అదృష్టం (1968)
ఉండమ్మా బొట్టుపెడతా (1968)
నిండు హృదయాలు (1969)
నిండు దంపతులు (1971)
చెల్లెలి కాపురం (1971)
చిన్ననాటి స్నేహితులు (1971)
కాలం మారింది (1972)
శారద (1973)
నేరము శిక్ష (1973)
అమ్మ మనసు (1974)
ఓ సీత కథ (1974)
జీవనజ్యోతి (1975)
మాంగల్యానికి మరోముడి (1975)
సిరిసిరిమువ్వ (1976)
ప్రేమబంధం (1976)
జీవిత నౌక (1976)
కాలాంతకులు (1978)
సీతామాలక్ష్మి (1978)
ప్రెసిడెంట్ పేరమ్మ (1979)
శంకరాభరణం (1980)
అల్లుడు పట్టిన భరతం (1980)
శుభోదయం (1980)
సప్తపది (1981)
శుభలేఖ 1982)
సాగరసంగమం (1983)
జననీ జన్మభూమి (1984)
స్వాతిముత్యం (1986)
సిరివెన్నెల (1986)
శ్రుతిలయలు (1987)
స్వయంకృషి (1987)
స్వర్ణకమలం (1988)
సూత్రధారులు (1989)
స్వాతికిరణం 1992)
ఆపద్బాంధవుడు (1992)
శుభసంకల్పం (1995)
చిన్నబ్బాయి (1997)
స్వరాభిషేకం (2004)
శుభప్రదం (2010)

హిందీ చిత్రావళి :
—————————-
సర్గం (సిరిసిరిమువ్వ) 1979
కామ్ చోర్ (శుభోదయం) 1982
శుభ్ కామ్నా (శుభలేఖ) 1983
జాగ్ ఉఠా ఇన్సాన్ (సప్తపది) 1984 సుర్ సంగం (శంకరాభరణం) 1985
సన్ జోగ్ (జీవనజ్యోతి) 1985
ఈశ్వర్ (స్వాతిముత్యం) 1989
సంగీత్ (1992)
ధన్వాన్ (1993)
ఔరత్ ఔరత్ ఔరత్ (1996)