బాలీవుడ్ కింగ్ ఖాన్ షారూక్ ఖాన్ (Sharukh khan), నటి దీపికా (Deepika) కలిసి జంటగా నటిస్తున్న పఠాన్ సినిమా విడుదలకు సిద్దమవుతోంది. అయితే ఈ మూవీలో బేషరమ్ సాంగ్ (Besharam Rang)ను మేకర్స్ ఎప్పుడైతే రిలీజ్ చేశారో అప్పట్నుంచే ఈ మూవీ పై ట్రోల్స్ మొదలయ్యాయి. బీచ్ లో స్విమ్ సూట్స్ లో దీపికా, సిక్స్ ప్యాక్ లో షారుక్ కనిపించి ఈ మూవీపై అంచనాలు రేపారు. ఈ పాట రెచ్చగొట్టేలా ఉందంటూ పలువురు విమర్శలు చేశారు. ఆ తర్వాత బాయ్ కాట్ అంటూ బీజేపీ నేతలు సైతం విమర్శలకు దిగారు.
ఈ మూవీపై ఎన్ని విమర్శలు వస్తున్నాయో… అంతకుమించి బేషరమ్ పాట (Besharam Rang)పై ట్రోల్స్ వచ్చాయి. హీరోయిన్ దీపికా టూ పీస్ బికినీలో కనిపించడమే అందుకు కారణం. తాజాగా ఈ పాటకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో (Social media) చక్కర్లు కొడుతోంది. భారీ కాయం గల ఓ మహిళ దీపికా హుక్ స్టెప్పులను వేసి ఆశ్చర్యపర్చింది. పఠాన్ సినిమాను ఏమాత్రం తీసిపోకుండా తన బరువైన శరీరంతో భారీ స్టెప్పులు వేసింది.
కేవలంలో స్టెప్పులకే పరిమితం కాకుండా దీపికా మాదిరిగా బికినీ వేసుకొని తన అందాలను ప్రదర్శించింది. బేషరమ్ పాటకు (Besharam Rang) తగ్గట్టుగా డాన్సులు, స్టెప్పులు వేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక నెటిజన్స్ సైతం ఘాటుగానే రియాక్ట్ అయ్యారు. “అమ్మా.. నేను మొత్తం నవ్వుతూనే ఉన్నాను. మీరు ఆ పాటను ఖూనీ చేశావ్’’ అంటూ కామెంట్స్ చేయగా, నీవు చాలా హాట్ గా ఉన్నవ్.. నమ్మలేకపోతున్నా అంటూ మరికొందరు నెటిజన్స్ (Netizens) రియాక్ట్ అయ్యారు.