నటి శోభిత ధూళిపాళ్ల (Sobhita Dhulipala) డిసెంబర్ 04 న అక్కినేని వారి కోడలు కాబోతున్న సంగతి తెలిసిందే. నాగ చైతన్య ను ఈమె వివాహం చేసుకోబోతుంది. అన్నపూర్ణ స్టూడియో లో కుటుంబ సభ్యులు , పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో వీరి వివాహం జరగనుంది. ఇప్పటీకే వెడ్డింగ్ కార్డ్స్ పంపకాలు , పెళ్లి వేదికకు సంబదించిన ఏర్పాట్లు ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ క్రమంలో శోభిత ధూళిపాళ్ల కి భారీ షాక్ తగిలింది.
చిత్రసీమలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఎమ్మీ అవార్డ్స్ (International Emmy Awards 2024 ) వేడుక తాజాగా న్యూయార్క్‌లో అట్టహాసంగా జరిగింది. ఈ అవార్డు వేడుకలో ఓ ఇండియ్ యాక్టర్ కూడా సందడి చేశారు. బాలీవుడ్ హాస్య నటుడు వీర్ దాస్ ఈ ప్రతిష్టాత్మక అవార్డ్ ఫంక్షన్‌కు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. అయితే ఈ అవార్డుల్లో శోభిత ధూళిపాళ్ల నటించిన వెబ్ సిరీస్ ది నైట్ మేనేజర్ (The Night Manager)కు నిరాశ ఎదురైంది. ఈ అవార్డుల్లో శోభిత ధూళిపాళ్ల నటించిన వెబ్ సిరీస్ ది నైట్ మేనేజర్ బెస్ట్ వెబ్ సిరీస్ విభాగంలో పోటీ పడింది. చాలా మంది సినీ ప్రియులు ఈ సిరీస్‌కు అవార్డు వస్తుందని అంతా ఆశించారు. కానీ ఎలాంటి అవార్డ్స్ రాకపోవడం అందర్నీ నిరాశకు గురి చేసింది. ఉత్తమ వెబ్ సిరీస్‌గా ఫ్రెంచ్ సిరీస్ ‘లెస్ గౌట్టెస్ డి డైయూ’ అవార్డు దక్కించుకుంది. దీంతో శోభిత కు భారీ షాక్ తగిలినట్లు అయ్యింది.
ఎమ్మీ అవార్డ్స్ విజేతల (International Emmy Awards 2024) విషయానికి వస్తే..
బెస్ట్ సిరీస్ – లెస్ గౌట్టెస్ డి డైయూ
బెస్ట్ యాక్టర్ – తిమోతీ స్పాల్
బెస్ట్ కామెడీ సిరీస్ – డివిజన్ పలెర్మో
బెస్ట్ టీవీ మూవీ – లైబ్స్ కైండ్
బెస్ట్ యానిమేటెడ్ సిరీస్ -టాబీ మెక్‌టాట్.
Read Also : ‘Samantha Second Hand ‘ : ‘సెకండ్ హ్యాండ్’ అంటూ సమంత ను హేళన చేశారట…