Site icon HashtagU Telugu

Pithapuram : పిఠాపురంలో భారీ ఈవెంట్..ఏమన్నా ప్లానా..?

పిఠాపురం (Pithapuram )..ఇప్పుడు ఈ పేరు దేశ వ్యాప్తంగా ఎంతో క్రేజ్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రేజ్ కు కారణం జనసేన అధినేత పవన్ కల్యాణే. ఏపీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పిఠాపురం నుండి పోటీ చేస్తున్నారని తెలిసిన దగ్గరి నుండి అంత పిఠాపురం గురించి అరా తీయడం మొదలుపెట్టారు. ఆ తర్వాత ఎన్నికల ప్రచారం కోసం సినీ ప్రముఖులంతా పిఠాపురంలో సందడిచేయడంతో మరింత ఫేమస్ అయ్యింది. ఇక ఇప్పుడు పిఠాపురం లో పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీ తో విజయం సాదించబోతున్నారని ఎగ్జిట్ పోల్స్ చెప్పడంతో ఆ ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇదే తరుణంలో హీరో శర్వానంద్ (Sharwanand) పిఠాపురంలో ఫలితాల తెల్లారే మెగా ఈవెంట్ కు ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. ఇది రాజకీయ పార్టీలకు సంబదించిన ఈవెంట్ కాదు..సినిమా ఈవెంట్. శర్వానంద్ హీరోగా నటించిన మనమే మూవీ రిలీజ్ కు సిద్ధమైంది. ఈ క్రమంలో జూన్ 05 న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను పిఠాపురంలో జరపబోతున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ బ్యానర్ లో కీలక వ్యక్తుల్లో ఒకరైన నిర్మాత విక్రమ్ కూడా శర్వా , రామ్ చరణ్ కు క్లోజ్ కావడం తో. స్నేహితుల కోసం ‘మనమే’ ప్రీ రిలీజ్ వేడుకకు రామ్ చరణ్ అతిథిగా హాజరు కానున్నారని తెలుస్తోంది. ఎన్నికల ఫలితాలు వచ్చిన మరుసటి రోజు… అదీ పిఠాపురంలో… రామ్ చరణ్ ముఖ్య అతిథిగా… అంటే పవన్ కళ్యాణ్ విజయోత్సవ సభ అవుతుందని ఫిల్మ్ నగర్ వర్గాల్లో డిస్కషన్ జరుగుతోంది. మరిన్ని మూవీ ఈవెంట్స్ అక్కడ చేసే ఉద్దేశంలో కొందరు దర్శక నిర్మాతలు ఉన్నారట.

‘మనమే’ ప్రీ రిలీజ్ ఈవెంట్ పిఠాపురంలో చేయడానికి ఇంకా పర్మిషన్ రాలేదని తెలిసింది. ఒక్కసారి పోలీసుల నుంచి అనుమతులు వచ్చిన తర్వాత చిత్ర బృందం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటన చేయాలని చూస్తోంది. ఇక మనమే చిత్రానికి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించగా.. హీరోయిన్ కృతి శెట్టి యాక్ట్ చేసింది. శ్రీరామ్ ఆదిత్య కుమారుడు విక్రమ్ ఓ మెయిన్ రోల్ చేశాడు. జూన్ 7న ఈ మూవీ థియేటర్లలోకి రానుంది.

Read Also : Telangana Formation Day 2024 : తెలంగాణ రాష్ట్ర గీతం విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి