Site icon HashtagU Telugu

Surya : పాపం..13 ఏళ్లుగా హిట్ లేని హీరో..ఎక్కడ మిస్ అవుతున్నాడబ్బా !

Surya Flops

Surya Flops

హీరోల కెరీర్‌లో హిట్స్, ఫ్లాప్స్ సహజం. అయితే కొన్ని ఫ్లాప్స్ ఎంతగానో ప్రభావితం చేస్తాయి. ఇప్పుడు అటువంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు తమిళ స్టార్ హీరో సూర్య (Surya). తన కెరీర్‌ ప్రారంభంలోనే ‘నంద’, ‘గజినీ’, ‘కాక్క కాక్క’, ‘సింగం’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో సూర్య స్టార్ హీరోగా ఎదిగారు. ఆయన విలక్షణ నటనకు ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది. కానీ ఈరోజు పరిస్థితి చూస్తే, ఆయన వెండితెరపై సరైన హిట్ అందుకోక 13 ఏళ్లు గడిచిపోయింది.

2013లో వచ్చిన ‘సింగం 2’ (యముడు 2) తర్వాత సూర్యకి పెద్ద హిట్ దక్కలేదు. అప్పటి నుంచి వచ్చిన అన్ని సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. భారీ అంచనాల మధ్య వచ్చిన ‘కంగువా’ కూడా అభిమానులను నిరాశపరిచింది. తాజాగా వచ్చిన రెట్రో చిత్రం కూడా అనుకున్న స్థాయిలో స్పందన రాకపోవడంతో, సూర్య కెరీర్ మళ్లీ డీలాపడినట్టే అయింది. అయితే ఓటీటీ వేదికపై మాత్రం సూర్య మెరిశారు. ‘ఆకాశమే నీ హద్దురా’, ‘జైభీమ్’ వంటి సినిమాలతో మంచి గుర్తింపు సంపాదించారు.

కానీ వెండితెరపై వచ్చిన సినిమాలు ఆశించిన విజయాలను ఇవ్వకపోవడంతో, సూర్య అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ప్రస్తుతం సూర్య చేయబోతున్న సినిమాలపై అభిమానులకెంతో ఆశలు ఉన్నాయి. ఈసారి అయినా సూర్య మంచి కమ్‌బ్యాక్ ఇస్తాడన్న ఆశతో ఎదురుచూస్తున్నారు. అసలు సూర్య ఎక్కడ ఫెయిల్ అవుతున్నాడు..? కథలను సరిగా ఎంచుకోలేకపోతున్నాడా..? లేకపోతే సరైన కథలు రావడం లేదా..? అని ఫ్యాన్స్ రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు.

Read Also  :  Coke Studio : భారత్, వివిధ సంగీత శైలుల సంగమాన్ని జరుపుకునే ఐకానిక్ వేదిక