Site icon HashtagU Telugu

Preminchoddu: ప్రతి విద్యార్థి చూడాల్సిన చిత్రం ‘ప్రేమించొద్దు’.. ట్రైలర్ రిలీజ్

Preminchoddu

Preminchoddu

Preminchoddu: శిరిన్ శ్రీరామ్ కేఫ్ బ్యానర్‌పై అనురూప్ రెడ్డి, దేవా మలిశెట్టి, సారిక, మానస ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ప్రేమించొద్దు’. శిరిన్ శ్రీరామ్ దర్శక నిర్మాణంలో సినిమా రూపొందింది. బ‌స్తీ నేపథ్యంలో సాగే యూత్‌ఫుల్ ప్రేమ కథాంశమిది. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. పాన్ ఇండియా చిత్రంగా 5 భాషల్లో నిర్మించారు. ఈ చిత్రం తెలుగు వెర్షన్‌‌ని జూన్ 7న విడుదల చేస్తున్నారు.ఆ తర్వాత, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో రిలీజ్ చేయ‌టానికి కూడా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ సందర్భంగా ఆదివారం నాడు మూవీ ట్రైలర్‌ను లాంచ్ చేశారు.

ఇది వరకు రిలీజ్ చేసిన టీజర్,పోస్టర్, సాంగ్స్‌తో సినిమా మీద మంచి బజ్ ఏర్పడింది. తెలిసీ తెలియని వయసులో ప్రేమించొద్దు అనే కాన్సెప్ట్‌తో రియల్ ఇన్సిడెంట్‌ల ఆధారంగా ఈ మూవీని రా అండ్ రస్టిక్‌గా తెరకెక్కించారని అర్థం అవుతోంది. తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్‌ను చూస్తే పూర్తి కథను వివరించినట్టుగా తెలుస్తోంది.

స్కూల్, కాలేజ్ ఏజ్ లవ్ స్టోరీలు, ప్రేమ అంటూ చదువుల్ని నిర్లక్ష్యం చేయడం, తెలిసీ తెలియని వయసులో ప్రేమిస్తే ఎదురయ్యే పరిణామాలను చూపించారు.ఇక ట్రైలర్‌లోని విజువల్స్, డైలాగ్స్ ఎంతో నేచురల్‌గా ఉన్నాయి. సమాజాన్ని తట్టిలేపేలా ఈ చిత్రం ఉంటుందని ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది.