టాలీవుడ్ (Tollywood) నటి సమంత (Samantha) క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఆమె నటనకు ఎంతోమంది అభిమానులున్నారు. సమంత మంచి నటి మాత్రమే కాదు.. మంచి మనస్సు ఉన్న స్టార్ కూడా. మధ్య తరగతి జీవితం అనుభవించిన సమంతకు పేదల కష్టాలు బాగా తెలుసు. అందుకే సమయం దొరికినప్పుడు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటుంటుంది. ముఖ్యంగా ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయించడంలో సమంత చూపిన చొరవ చెప్పలేనిది. ఆమె మానవత్వానికి ఓ అభిమాని ఫిదా అయ్యాడు.
సమంతపై అభిమానంతో ఏకంగా గుడి (Temple) కట్టాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బాపట్ల జిల్లా చుండూరు మండలం అలపాడుకు చెందిన తెనాలి సందీప్ అనే యువకుడు సమంతకు వీరాభిమాని. ఆమె నటనతో పాటు సేవా కార్యక్రమాలకు ఆకర్షితుడైయ్యాడు.
అనారోగ్యం పాలైన చిన్న పిల్లలకు పునర్జన్మ ప్రసాదిస్తున్నసమంతపై అభిమానం రెట్టింపవ్వడంతో గుడి కట్టాలని నిర్ణయించుకున్నాడు. తన ఇంటి ప్రాంగణంలోనే ఆలయ కోసం స్థలం కేటాయించి విగ్రహాన్ని కూడా తయారు చేయించాడు. ప్రస్తుతం విగ్రహానికి, గుడికి తుది మెరుగులు దిద్దే పనులు జరుగుతున్నాయి. ఈ నెల 28వ తేదీన ఆలయం ప్రారంభిస్తున్నట్లు సందీప్ తెలిపారు. సమంత (Samantha)ను కలిసే అవకాశం వస్తే వదులుకోనని చెప్పాడు.
Also Read: Anushka Trolled: లావెక్కిన అనుష్క.. ఆంటీలా ఉందంటూ ట్రోల్స్!