Site icon HashtagU Telugu

Allu Arjun Arrest : కాంగ్రెస్ ప్రభుత్వంకు పెద్ద దెబ్బ…?

Alluarjun Arrest Congres

Alluarjun Arrest Congres

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్‌(Allu Arrest)ను అరెస్ట్ చేయడం పై యావత్ అభిమానులు , సినీ ప్రముఖులే కాదు రాజకీయేతర పార్టీ నేతలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చిత్ర సీమ విషయంలో రేవంత్ సర్కార్ వ్యవహరిస్తున్న తీరు పై సినీ ప్రముఖులు మండిపడుతున్నారు. హైడ్రా పేరుతో నాగార్జున కు సంబదించిన కన్వెన్షన్ హాల్ ను కూల్చడం నుండే చిత్రసీమ ఫైర్ అయ్యింది. ఆ తర్వాత నుండి వరుసగా సినీ ప్రముఖులకు ప్రభుత్వం నుండి ఎదురవుతున్న ఇబ్బందులు అనేక మందిలో ఆగ్రహం నింపుతుండగా..ఇక ఇప్పుడు అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడం పై మరింత ఫైర్ అవుతుంది.

ఈ అరెస్టు, ముఖ్యంగా మెగా ఫ్యామిలీకి చెందిన నటుడి అరెస్టు, ప్రభుత్వంపై విమర్శలు పెరిగే అవకాశాన్ని కలిగిస్తుంది. సినిమా పరిశ్రమలో అత్యంత ప్రముఖమైన అల్లు అర్జున్‌కు సంబంధించిన ఈ ఘటన, ప్రజల మనసులో ప్రశ్నలు పెంచే అవకాశముంది. ముఖ్యంగా అల్లు అర్జున్ అభిమానుల ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. అల్లు అర్జున్ అభిమానులు, సినిమా పరిశ్రమలోని ప్రముఖులు ఈ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీల నేతలు సైతం ఈ అరెస్ట్ ను ఖండిస్తున్నారు.

ఇప్పటికే తెలంగాణ మాజీ మంత్రి, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. జాతీయ అవార్డు గ్రహీతపై ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరించడం పాలకుల అశ్రద్ధకు నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట బాధితులకు పూర్తిగా సానుభూతి తెలుపుతాను.. కానీ ఘటనలో నిజంగా తప్పు చేసింది ఎవరని కేటీఆర్‌ ప్రశ్నించారు. ఘటనకు నేరుగా బాధ్యుడు కానీ అల్లు అర్జున్‌ను సాధారణ నేరగాడిలా ట్రీట్‌ చేయడం సరికాదని కేటీఆర్‌ అన్నారు. ప్రభుత్వ తీవ్ర చర్యను ఖండిస్తున్నానని తెలిపారు. హైడ్రా కూల్చివేతలతో ఇద్దరి చావుకు బాధ్యుడైన రేవంత్‌ రెడ్డిని కూడా ఇదే లాజిక్‌తో అరెస్టు చేయాలని సూచించారు.

ప్రస్తుతం సీఎం రేవంత్ అందుబాటులో లేరు..ఈ క్రమంలో అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడం అనేది ఇప్పుడు సర్వ్త్ర చర్చ గా మారింది. ఈరోజు సాయంత్ర 4 గంటలకు నాంపల్లి కోర్ట్ లో ఈ అరెస్ట్ పై విచారణ జరగనుంది. మరి రిమాండ్ కు తరలిస్తారా..? లేక బెయిల్ ఇస్తారా అనేది చూడాలి.

Read Also : Allu Arjun : గాంధీ హాస్పటల్ లో అల్లు అర్జున్ కు వైద్య పరీక్షలు