OTT : సినిమా రంగంలోOTT ప్రభావం రోజు రోజుకీ పెరుగుతోంది. ఇక హాలీవుడ్ సినిమాలే నెల రోజులు తిరకుండానే ఓటీటీలోకి వచ్చేస్తున్న తరుణంలో, చిన్న సినిమాలు మరింత వేగంగా డిజిటల్ ప్లాట్‌ఫామ్ వైపు సాగిపోతున్నాయి. అలాంటి చిత్రాల్లో తాజాగా చేరింది ‘8 వసంతాలు’.
ఫణీంద్ర నరిశెట్టి దర్శకత్వం వహించిన ఈ ఎమోషనల్ లవ్ డ్రామా జూన్ 20న థియేటర్లలో విడుదలైంది. పెద్దగా ప్రొమోషన్ లేకున్నా, హృదయాన్ని తాకే ప్రేమకథ అంటూ ఓ విభిన్నమైన సినిమా రాబోతోందని ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. అనంతిక సనిల్ కుమార్, హనురెడ్డి, రవితేజ దుగ్గిరాల కీలక పాత్రల్లో నటించారు. మ్యూజిక్ డైరెక్టర్ హేశామ్ అబ్దుల్ వహబ్ అందించిన సంగీతం సినిమాకు మంచి ప్లస్ పాయింట్‌గా నిలిచింది.
Tahawwur Rana : ముంబై 26/11 ఉగ్రదాడి కేసులో కీలక మలుపు..నేరం అంగీకరించిన తహవ్వూర్ రాణా…
అయితే థియేటర్లలో ఈ సినిమాకు ఆశించిన రీస్పాన్స్ రాలేదు. యూత్‌తో కనెక్ట్ కావడంలో కొంత గ్యాప్ కనిపించింది. అయినా కథ, ఎమోషన్ పరంగా మంచి కంటెంట్ ఉన్నందున ‘8 వసంతాలు’ ఇప్పుడు OTTలో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది.
Netflix సంస్థ ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. జూలై 11వ తేదీ నుంచి ఈ చిత్రం తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషలలో స్ట్రీమింగ్‌కు రానుంది. అయోధ్య అనే యువతి జీవితంలోకి వరుణ్, సంజయ్ అనే ఇద్దరు వ్యక్తులు ప్రవేశించి, ఆమె జీవితాన్ని ఎలా మార్చేశారు? అనే కథాంశం చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. థియేటర్లలో అవకాశాన్ని కోల్పోయిన ఈ సినిమా, యువతను ఓటీటీ ద్వారా ఎంతగానో ఆకట్టుకుంటుందని నిర్మాతలు ఆశిస్తున్నారు.
B. R. Gavai: న్యాయ సిద్ధాంతం పై జస్టిస్ బీఆర్ గవాయి ఆసక్తికర వ్యాఖ్యలు