2025లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 71వ జాతీయ చలనచిత్ర పురస్కాలలో(71st National Film Awards Announced) తెలుగు చిత్రసీమకు గర్వకారణమైన గుర్తింపులు లభించాయి. 2023 సంవత్సరానికి గాను ఎంపికైన ఈ అవార్డులను కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, ఎల్ మురుగన్‌కు జ్యూరీ సభ్యులు అందజేశారు. అనంతరం ఢిల్లీలోని నేషనల్ మీడియా సెంటర్‌లో మీడియా సమావేశం నిర్వహించి విజేతల వివరాలను వెల్లడించారు. ఈ అవార్డుల్లో తెలుగు చిత్రాలు పలువురికి ప్రతిష్ఠాత్మక గుర్తింపులు తీసుకువచ్చాయి.
అవార్డుల్లో ఉత్తమ తెలుగు చిత్రంగా నందమూరి బాలకృష్ణ నటించిన “భగవంత్ కేసరి” ఎంపికైంది. ఈ సినిమాకు దర్శకుడిగా అనిల్ రవిపూడి వ్యవహరించారు. అలాగే విజువల్ ఎఫెక్ట్స్, యానిమేషన్, గేమింగ్ విభాగంలో “హనుమాన్” సినిమా ప్రత్యేక గుర్తింపును పొందింది. ఈ చిత్రానికి ఉత్తమ యాక్షన్ డైరెక్షన్ విభాగంలో నందు, పృథ్వీ స్టంట్స్‌కు అవార్డు లభించింది. హనుమాన్ సినిమా తెలుగు సినిమా స్థాయిని కొత్త దశకు తీసుకెళ్లింది.
palm scan payments : నో యూపీఐ, నో కార్డ్స్.. అరచేతి స్కాన్‌తో నగదు చెల్లింపులు..ఎక్కడంటే?
ఇంకా “బలగం” సినిమాలోని “ఊరు పల్లెటూరు” అనే పాటకు ఉత్తమ గీత రచయిత విభాగంలో కాసర్ల శ్యామ్ అవార్డు అందుకున్నారు. ప్రముఖ దర్శకుడు సాయి రాజేష్ తెరకెక్కించిన “బేబీ” సినిమా స్క్రీన్ ప్లే విభాగంలో ఉత్తమంగా నిలిచింది. అదే చిత్రానికి చెందిన పివి ఎన్ఎస్ రోహిత్ ఉత్తమ గాయకుడిగా గుర్తింపు పొందాడు. ఉత్తమ బాలనటిగా సుకృతి వేణి (సుకుమార్ కుమార్తె) “గాంధీ తాత చెట్టు” సినిమాలో నటనకు జాతీయ అవార్డు అందుకుంది.
ఇతర భాషల సినిమాల్లో కూడా గుర్తింపు లభించింది. ఉత్తమ తమిళ చిత్రంగా “పార్కింగ్”, ఉత్తమ గారో భాషా చిత్రంగా “రాప్చర్”, ఉత్తమ తాయ్ ఫేక్ సినిమాగా “స్టెప్ ఆఫ్ హోప్” ఎంపికయ్యాయి. నాన్ ఫీచర్ విభాగంలో ఉత్తమ డాక్యుమెంటరీగా “గాడ్ వల్చర్ అండ్ హ్యూమన్” (తెలుగు, హిందీ, ఇంగ్లీష్) నిలిచింది. మొత్తంగా చూసుకుంటే, తెలుగు సినిమాలు జాతీయస్థాయిలో మరోసారి ప్రతిభను నిరూపించుకుని, ప్రేక్షకులకు గర్వించదగిన క్షణాలను అందించాయి.