Site icon HashtagU Telugu

Busiest Heroine: 7 సినిమాలు, 2 షిప్టులు.. శ్రీలీల బిజీ బిజీ!

Sreeleela exclusive dhamaka

Sreeleela

యంగ్ బ్యూటీ శ్రీలీల ప్రస్తుతం టాలీవుడ్‌లో డిమాండ్ ఉన్న కథానాయిక. అయితే ఈ బ్యూటీకి మొదట రెండు సినిమాలు మాత్రమే ఆఫర్స్ వచ్చాయి. పెళ్లి సందడితో శ్రీలీలకు మంచి గుర్తింపు రాగా, ధమాకా మంచి హిట్ ను సొంతం చేసుకుంది. మాస్ మహారాజ రవితేజ కంటే ఎక్కువ మార్కలే కొట్టేసింది. శ్రీలీల వల్ల ధమాకా మూవీ హిట్ అయ్యిందని సినీ క్రిటిక్స్ సైతం అభిప్రాయపడ్డారు. ఆ మూవీలో తన నటన, ఆకట్టుకునే డ్యాన్స్ తో తనలోని టాలెంట్ ను బయటపెట్టింది. దీంతో ఈ బ్యూటీకి వరుస అవకాశాలు తలుపు తడున్నాయి.

నిర్మాతలు ఈ హీరోయిను బుక్ చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం 1 కాదు.. 2 కాదు 7 సినిమాలతో బిజీ బిజీగా ఉందంటే శ్రీలీల జోరు ఎలా ఉందో అర్దం చేసుకోవచ్చు. 7 ప్రాజెక్ట్‌ల షూటింగ్ షెడ్యూల్స్‌కు అంతరాయం కలగకుండా రోజుకు దాదాపు 2 షిఫ్టులు పనిచేస్తోంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో SSMB28లో సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన నటించే అవకాశాన్ని శ్రీలీల చేజిక్కించుకుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-హరీష్ శంకర్ ల ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో ఆమె నటిస్తోంది.

ఇక ఈ నటి రామ్ పోతినేని, నితిన్, విజయ్ దేవరకొండ సినిమాల్లో కూడా చేస్తోంది. ఇవి కాకుండా మరికొన్ని ప్రాజెక్టుల కోసం ఆమెను సంప్రదిస్తున్నారు. ఒక నటి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయడం మరియు రోజుకు 2 షిఫ్టులు పనిచేయడం అరుదైన విషయం. శ్రీలీల తెలుగులో అగ్ర కథానాయికగా అవతరించడానికి ఎక్కువ సమయం పట్టదు అనిపిస్తుంది. శ్రీలీల ధాటికి బుట్టబొమ్మ అయిన పూజహెగ్డేకు తెలుగులోకి అవకాశాలు లేకుండా పోయాయి.

Also Read: CM KCR: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల లోగో ఆవిష్కరణ