ప్రముఖ నిర్మాత AM రత్నం తనయుడు రవికృష్ణ(Ravikrishna) ని హీరోగా పరిచయం చేస్తూ సోనియా అగర్వాల్(Soniya Agarwal) హీరోయిన్ గా, సెల్వ రాఘవన్(Selva Raghavan) దర్శకత్వంలో తమిళ్ లో తెరకెక్కిన సినిమా 7/G బృందావన్ కాలనీ(7/g Brindavan Colony). ఈ సినిమా తమిళ్ లో మంచి విజయం సాధించింది. తమిళ్(Tamil) లో హిట్ అయిన నెల రోజులకే తెలుగులో(Telugu) కూడా డబ్బింగ్ చేసి రిలీజ్ చేయగా ఇక్కడ కూడా మంచి విజయం సాధించింది. ఇప్పటికే ఈ సినిమాకు, సినిమాలోని పాటలు, సన్నివేశాలకు ఫ్యాన్స్ ఉన్నారు.
7/G బృందావన్ కాలనీ సినిమాలో కామెడీ, ప్రేమ, ఎమోషనల్.. ఇలా అన్ని అంశాలు ప్రేక్షకులని మెప్పించాయి. హీరో, అతని ఫ్రెండ్స్ చేసే కామెడీ, హీరోయిన్ తో ప్రేమ సన్నివేశాలు, తండ్రి చంద్రమోహన్ తో హీరో ఎమోషన్ సీన్స్, ఎమోషనల్ క్లైమాక్స్, యువన్ శంకర్ రాజా సంగీతం.. ఇలా అన్ని అంశాలు ఈ సినిమా హిట్ అవ్వడానికి తోడ్పడ్డాయి. 7/G బృందావన్ కాలనీ సినిమా తర్వాత హీరో రవికృష్ణ కొన్ని సినిమాలు చేసినా గత కొన్నాళ్లుగా మాత్రం సినిమాలకు దూరంగా ఉన్నాడు.
తాజాగా ఈ సినిమాకు సీక్వెల్ రాబోతుందని తమిళ్ లో వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం నటుడిగా, దర్శకుడిగా ఫుల్ ఫామ్ లో ఉన్నారు సెల్వ రాఘవన్. సెల్వ రాఘవన్ దర్శకత్వంలోనే మళ్ళీ రవికృష్ణ హీరోగా 7/G బృందావన్ కాలనీ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ప్రస్తుత ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. దీంతో ఈ సినిమా అభిమానులు త్వరగా దీనికి సీక్వెల్ తీయాలని కోరుకుంటున్నారు. మరి 7/G బృందావన్ కాలనీ సీక్వెల్ ఎప్పుడొస్తుందో చూడాలి.
Also Read : Urvashi Rautela: ఉమైర్ సంధు ట్వీట్ పై లీగల్ నోటీసులు పంపించిన ఊర్వశి రౌతౌలా.. ట్వీట్ వైరల్?