Tabu : 50 ఏళ్లు అయినా రొమాన్స్ విషయంలో తగ్గేదేలేదంటున్న హీరోయిన్..!

Tabu అందాల భామ టబు కెరీర్ మొదలు పెట్టింది తెలుగులోనే అయినా బాలీవుడ్ వెళ్లి అక్కడ స్టార్ క్రేజ్ తెచ్చుకుంది. హిందీలో హాట్ హీరోయిన్ గా సూపర్ పాపులారిటీ

  • Written By:
  • Publish Date - June 15, 2024 / 12:58 PM IST

Tabu అందాల భామ టబు కెరీర్ మొదలు పెట్టింది తెలుగులోనే అయినా బాలీవుడ్ వెళ్లి అక్కడ స్టార్ క్రేజ్ తెచ్చుకుంది. హిందీలో హాట్ హీరోయిన్ గా సూపర్ పాపులారిటీ సంపాదించిన టబు ఇప్పటికీ అక్కడ తన ఫాం కొనసాగిస్తుంది. టబు అనగానే ఆమె బోల్డ్ ఇమేజ్ గుర్తుకొస్తుంది. తెలుగులో కూడా అమ్మడు చేసిన సినిమాలు దాదాపు రొమాంటిక్ టచ్ తో వచ్చినవే. హిందీలో ఎంత బిజీగా ఉన్నా ఇప్పటికీ తెలుగులో ఆఫర్ వస్తే కాదనకుండా చేస్తుంది టబు.

ఇదిలాఉంటే టబు ఇప్పటికి కూడా రొమాంటిక్ సినిమాల్లో చేసేందుకు రెడీ అంటుంది. తన ఏజ్ 52 అయినా కూడా రొమాంటిక్ సీన్స్ కు సిద్ధం అనేస్తుంది అమ్మడు. టబు కెరీర్ లో అలాంటి సినిమాలకే ఎక్కువ ప్రధాన్యత ఇచ్చింది. ఆడియన్స్ లో తానొక రొమాంటిక్ స్టార్ గా పేరు తెచ్చుకుంది. అందుకే ఇప్పటికీ తన ఫ్యాన్స్ కోసం అలాంటి సినిమాలు చేసేందుకు రెడీ అనేస్తుంది.

ఐతే 50 ఏళ్లు దాటాక కూడా అమ్మడు అలాంటి సినిమాలు చేయాలని అనుకోవడం పెద్ద సాహసమే అనుకోవాలి. టబు చేస్తానంటే చాలు ఇప్పటికీ ఆమెకు అవకాశాలు ఇచ్చే మేకర్స్ ఉన్నారని చెప్పొచ్చు. ఈమధ్యనే క్రూ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన టబు ఆ సినిమాతో సక్సెస్ అందుకున్నారు. టబు తో పాటుగా క్రూ సినిమాలో కరీనా కపూర్, కృతి సనన్ నటించారని తెలిసిందే.

Also Read : NTR Devara : దేవర ముందుకొచ్చింది.. కన్ ఫ్యూజన్ మొదలైంది..!