Site icon HashtagU Telugu

Mega 156 : అనుష్క కోసం 5 కోట్లా..?

Anushka Krish Title as Silavathi

Anushka Krish Title as Silavathi

Mega 156 స్వీటీ అనుష్క సినిమాల విషయంలో చాలా ఆచి తూచి ఎంపిక చేసుకుంటుంది. నిశ్శబ్ధం తర్వాత చాలా గ్యాప్ ఇచ్చి మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాలో నటించిన అనుష్క ఆ సినిమాతో మంచి ఫలితాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా తర్వాత అనుష్క మెగాస్టార్ చిరంజీవి 156వ సినిమాలో ఛాన్స్ అందుకుంది. మెగా 156వ సినిమాగా చిరు సరసన అదిరిపోయే అవకాశాన్ని అందుకుంది అమ్మడు.

వశిష్ఠ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా యువి క్రియేషన్స్ బ్యానర్ లో వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అనుష్క (Anushka) నటించేందుకు గాను దాదాపు 5 కోట్ల దాకా రెమ్యునరేషన్ అందుకుంటుందని తెలుస్తుంది. ఈమధ్య హీరోలతో పాటుగా హీరోయిన్స్ కి కూడా రెమ్యునరేషన్ పెంచేశారు. మొన్నటిదాకా కోటి కోటిన్నర ఉన్న హీరోయిన్స్ 3, 4 కోట్లు అంటున్నారు.

వారి దారిలో అనుష్క కూడా 5 కోట్ల దాకా డిమాండ్ చేస్తుందని తెలుస్తుంది. పాన్ ఇండియా రిలీజ్ అవుతున్న సినిమా కాబట్టి ఆమె అంత అడగడంలో కూడా తప్పేమి లేదు. చిరంజీవి స్టాలిన్ సినిమాలో అనుష్క స్పెషల్ సాంగ్ చేసింది. మళ్లీ ఇన్నాళ్లకు కలిసి నటిస్తున్నారు. మెగా 156 సినిమాలో అనుష్క తన టాలెంట్ తో అందరినీ మెప్పిస్తుందని తెలుస్తుంది.

Also Read : Bigg Boss 7 : వాళ్లని ఇంకెన్నాళ్లు కాపాడుతారు..?

We’re now on WhatsApp : Click to Join