Site icon HashtagU Telugu

Mangalavaaram: ‘మంగళవారం’ చిత్రానికి జైపూర్ ఫిలిం ఫెస్టివల్ లో 4 అవార్డులు!

Paayal Rajput Mangalavaaram Movie Ready to Streaming in OTT

Paayal Rajput Mangalavaaram Movie Ready to Streaming in OTT

Mangalavaaram: ‘ఆర్ఎక్స్ 100’, ‘మహాసముద్రం’ చిత్రాల తర్వాత అజయ్ భూపతి దర్శకత్వం వహించిన సినిమా ‘మంగళవారం’. థ్రిల్లింగ్ రెస్పాన్స్ తో థియేటర్లలో బ్లాక్ బస్టర్ అయిన ఈ చిత్రం ఇటీవల పాపులర్ ఓటిటి డిస్నీ హాట్ స్టార్ లో విడుదలై ప్రపంచవ్యాప్త ప్రేక్షకులని కూడా అలరిస్తుంది. ‘మా మంగళవారం, టెక్నీషియన్స్ సినిమా అని గర్వంగా చెబుతున్నాను!’ అని డైరెక్టర్ అజయ్ భూపతి సక్సెస్ మీట్ లో చెప్పింది నిజం చేస్తూ ప్రతిష్ఠాత్మకంగా జరిగే జైపూర్ ఫిలిం ఫెస్టివల్ లో 4 అవార్డులని గెలుచుకుంది. చిత్ర నిర్మాతలు ముద్ర మీడియా వర్క్స్ స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ ఈ విషయాన్ని సంతోషంగా చెబుతూ అవార్డులు గెలిచిన వారి పేర్లు వెల్లడించారు.

1. ఉత్తమ నటి – పాయల్ రాజపుత్
2. ఉత్తమ సౌండ్ డిజైన్ – రాజా కృష్ణన్
3. ఉత్తమ ఎడిటింగ్ – గుళ్ళపల్లి మాధవ్ కుమార్
4. ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ – ముదసర్ మొహమ్మద్

కథ – కథనాలతో ఆకట్టుకుంటూనే సాంకేతిక పరంగా, నిర్మాణ పరంగా అద్భుతమైన విలువలున్న చిత్రంగా ‘మంగళవారం’ ఇప్పటికే దిగ్గజాల నుండి ప్రశంసలు అందుకోగా ఈ అవార్డులు కేవలం ఆరంభం మాత్రమే అని తమ ఆనందం వ్యక్తం చేసారు చిత్ర దర్శకుడు, నిర్మాతలు. ముద్ర మీడియా వర్క్స్ స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ నిర్మాణ భాగస్వామ్యంలో ‘ఎ’ క్రియేటివ్ వర్క్స్ పతాకం పై అజయ్ భూపతి ఈ చిత్ర నిర్మాణం లోకి భాగమయ్యారు.

నటీనటులు: పాయల్ రాజ్‌పుత్, అజ్మల్ అమీర్, శ్రీ తేజ్, చైతన్య కృష్ణ, అజయ్ ఘోష్, లక్ష్మణ్ తదితరులు.
సినిమాటోగ్రఫీ : దాశరథి శివేంద్ర
మ్యూజిక్ : ‘కాంతార’ ఫేమ్ బి. అజనీష్ లోక్‌నాథ్
ఎడిటర్ : మాధవ్ కుమార్ గుళ్ళపల్లి,
మాటలు : తాజుద్దీన్ సయ్యద్, రాఘవ్,
ఆర్ట్ డైరెక్టర్ : మోహన్ తాళ్లూరి,
ప్రొడక్షన్ డిజైనర్ : రఘు కులకర్ణి,
ఫైట్ మాస్టర్స్ : రియల్ సతీష్, పృథ్వీ,
సౌండ్ డిజైనర్ & ఆడియోగ్రఫీ : ‘నేషనల్ అవార్డ్ విన్నర్’ రాజా కృష్ణన్,
కొరియోగ్రఫీ : భాను,
కాస్ట్యూమ్ డిజైనర్ : ముదాసర్ మొహ్మద్,
డిజిటల్ మార్కెటింగ్: టాక్ స్కూప్,
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సాయికుమార్ యాదవిల్లి,
నిర్మాతలు : స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ .ఎం,
కథ – స్క్రీన్ ప్లే – దర్శకత్వం: అజయ్ భూపతి.