Nandi awards : నంది అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి మళ్లీ శ్రీకారం చుట్టిన ఏపీ సర్కార్

నంది అవార్డుల పోటీలలో 38 మంది ఎంపికయ్యారని వెల్లడించారు. ఉత్తములు, అర్హులకు మాత్రమే ఈ అవార్డులను అందిస్తామని, ఒకేసారి సినిమా, టీవీ, డ్రామా రంగాలకు అవార్డులు ఇవ్వడం సాధ్య పడదని ప్రకటించారు

  • Written By:
  • Publish Date - October 13, 2023 / 07:55 PM IST

ఒకప్పుడు చిత్రసీమలో నంది అవార్డుల (Nandi Awards) ప్రదానోత్సవం ఎంతో అట్టహాసంగా జరిగేది. కానీ కొంతకాలంగా ఈ అవార్డ్స్ వేడుకను జరపడం లేదు. ఈ క్రమంలో మళ్లీ నంది అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి ఏపీ సర్కార్ (AP Govt) శ్రీకారం చుట్టింది.

ఈ కార్యక్రమ బాధ్యతలను ఏపీ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్, నటుడు పోసాని కృష్ణ మురళి (Posani Krishna Murali )కి అప్పగించింది ప్రభుత్వం. దీనిపై పోసాని మాట్లాడుతూ.. నంది అవార్డుల పోటీలలో 38 మంది ఎంపికయ్యారని వెల్లడించారు. ఉత్తములు, అర్హులకు మాత్రమే ఈ అవార్డులను అందిస్తామని, ఒకేసారి సినిమా, టీవీ, డ్రామా రంగాలకు అవార్డులు ఇవ్వడం సాధ్య పడదని ప్రకటించారు. మొదటిగా పద్యనాటకాలకు అందించి, ఆ తర్వాత మిగతా రంగాలకు అందిస్తామని పేర్కొన్నారు. ఈ మేరకు పోటీలు నిర్వహించగా.. గుంటూరులో ఫైనల్స్ నిర్వహిస్తామన్నారు. వీరిలో 38 మంది ఎంపికయ్యారని తెలిపారు.

We’re now on WhatsApp. Click to Join.

సినిమా రంగంలో ఏ స్థాయిలో పని చేసే వారైనా.. ఏపీకి చెందిన వాళ్ళు అయితే వారికి ఐడీ కార్డ్స్ అందజేస్తామని తెలిపారు. దానికి సంబందించిన విధివిధానాలు ఇప్పటికే సిద్ధం అయినట్లు చెప్పారు. దీనికి సంబంధించి అక్టోబర్ 15 నుండి ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అలాగే వారి డీటెయిల్స్ ఇస్తే… వాటిని స్క్రూటినీ చేసి ఐడీ కార్డ్స్ అందజేస్తామని తెలిపారు.

Read Also : BRS Minister: మంత్రి వేముల మాతృ మూర్తి మంజులమ్మకు కన్నీటి వీడ్కోలు