Site icon HashtagU Telugu

Shobhita Rana Bikini: పెళ్లి చేసుకున్నా తగ్గేదేలే.. బికినీతో శోభితా రానా గ్లామర్ ట్రీట్

Shobitha

Shobitha

శోభితా రానా అనేది పెద్దగా పరిచయం లేని పేరు. ఈ బ్యూటీ విపరీతమైన సోషల్ మీడియా ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది. తెలుగులో వైష్ణవ్ తేజ్, కేతికా శర్మ ప్రధాన పాత్రలలో నటించిన ‘రంగ రంగ వైభవంగా’ సినిమాలో నటించింది. అంతేకాదు.. ‘ఇష్క్ బ్రాందీ’ వంటి చిత్రాలతో కూడా ఆకట్టుకుంది. సినిమాల్లో నటిస్తుండగానే తరుణ్ అగర్వాల్‌ను వివాహం చేసుకుంది.

31 ఏళ్ల వయసులోనూ చక్కని ఫిజిక్ తో ఆకట్టుకుంటోంది. ఈ బ్యూటీ ఇటీవల దుబాయ్‌లోని బీచ్‌లో హాట్ హాట్ స్టిల్స్ తో ఆకట్టుకుంది. బ్లూ బికినీ టాప్ ధరించి అందాలు ఒలకబోసింది. మిరుమిట్లు గొలిపే అందంతో సినిమా అవకాశాలను దక్కించకుంటుంది. సినిమాల్లో తనదైన ముద్ర వేయకపోయినప్పటికీ, గ్లామర్‌ ట్రీట్ ను అందించడంలో ముందుంటోంది.

సోలో హీరోయిన్ గా అవకాశాల కోసం ఎదురుచూస్తున్న శోభిత సినిమాల కన్నా ఇన్ స్టాగ్రాం లో ఎక్కువ ఫాలోవర్స్ ను ఏర్పరచుకుంటుంది. తన ఫాలోవర్స్ ని ఎప్పటికప్పుడు తన గ్లామర్ షో తో మెప్పిస్తూ వస్తున్న శోభిత రీసెంట్ ఫోటోల్లో మరింత రెచ్చిపోయిందని చెప్పొచ్చు. సినిమా ఛాన్స్ లు ఎలా ఉన్నా ఇలా సోషల్ మీడియా ఫోటో షూట్స్ తోనే అభిమనులను అలరిస్తోంది. ప్రస్తుతం శోభితా బికినీ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Also Read: Shah Rukh Khan: అర్ధరాత్రి ఫోన్ చేసినా అందుబాటులో ఉంటా: షారుక్ ఖాన్